జనసేన కార్యకర్తకు నివాళులర్పించిన పోలిశెట్టి తేజ

మైలవరం: ఇబ్రహీంపట్నం, మండలం మూలపాడు గ్రామ జనసేన పార్టీ కార్యకర్త చింతల రమేష్ అనారోగ్య కారణంగా మరణించగా మూలపాడులోని వారి స్వగృహం నందు తన భౌతికకాయానికి పూలమాలవేసి నివాళులు అర్పించి వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. జనసేన పార్టీ ఇబ్రహీంపట్నం మండల అధ్యక్షుడు మరియు ఎంపీటీసీ సభ్యుడు పోలిశెట్టి తేజ.. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు చేకూరి వెంకటేశ్వరావు, తుంగం నరేష్, మధు, వన్నెంరెడ్డి కోటేశ్వరరావు మరియు గ్రామ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.