అంబేద్కర్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన పొన్నలూరు జనసేన

*పొన్నలూరు మండలంలో అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాము

*అంబేద్కర్ గారు కల్పించిన రిజర్వేషన్లు అనుభవిస్తూ, పదవులు పొంది, కనీసం మండలంలో విగ్రహాన్ని పెట్టడానికి కూడా మొహం చాటేస్తున్న నాయకులు

ప్రపంచ మేధావి, నవభారత నిర్మాత, రాజ్యాంగ రూపకర్త, ప్రముఖ న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నేత, భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 131వ జయంతి సందర్భంగా పొన్నలూరు మండలంలో అగ్రహారంలో అంబేద్కర్ గారి విగ్రహానికి “జనసేన పార్టీ” నాయకులు పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది.
ప్రపంచ దేశాలు మొత్తం అంబేద్కర్ గారి గురించి చెప్పుకుంటూ ఉంటే భారతీయులుగా మనమందరం గర్వపడాలి మరియు సంతోషపడాలి,
ఓటు హక్కును కల్పించి మన తలరాతను మనమే మార్చుకునే గొప్ప అవకాశాన్ని కల్పించిన వ్యక్తి అంబేద్కర్ గారు, స్వాతంత్ర్య భారతదేశపు మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రిగా, రాజ్యాంగ శిల్పిగా, భారతదేశానికి ఎన్నో సేవలందించిన ఆదర్శవంతమైన వ్యక్తి అంబేద్కర్ గారు,
ఎన్నో కష్టాలు, అంటరానితనాన్ని ఎదుర్కొని, కనీసం తాగడానికి మంచి నీళ్లు ఉండి కూడా అవి తాగలేని పరిస్థితులు, ఎన్నో అవమానాలు, ఎన్నో అవహేళనలు, అన్ని భరించి తన కుటుంబాన్ని అణగారిన వర్గాల వారి కోసం త్యాగం చేసిన గొప్ప మనిషి,
ప్రతి ఒక్కరూ అంబేద్కరిజం గురించి తెలుసుకోవాలి, జై భీమ్ అని అందరూ అనాలి, ఎందుకంటే అంబేద్కర్ గారు ఒక కులానికో, ఒక వర్గానికో చెందిన వ్యక్తి మాత్రం కాదు, యావత్ భారతదేశం మొత్తం గర్వించదగ్గ వ్యక్తి భారతదేశానికి ఎన్నో సేవలందించిన అగ్రగణ్యుడు,
అతి తొందరలో పొన్నలూరు మండలం సెంటర్లో అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాము,
కొంతమంది మండల నాయకులు అంబేద్కర్ గారు కల్పించిన రిజర్వేషన్లు అనుభవిస్తూ వారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి అనే ఆలోచన కూడా లేకుండా వ్యవహరిస్తున్న తీరు దళితుల అందరిని బాధ కలిగిస్తుంది, అంబేద్కర్ గారి పేరు చెప్పుకుంటూ ఓట్లు వేయించుకొని కనీసం విగ్రహాన్ని కూడా పెట్టకపోవడం పొన్నలూరు మండలం ప్రజలందరూ సిగ్గుతో తల దించుకుంటున్నారు, ఇటువంటి వ్యక్తులకు ఓట్లు వేసినందుకు పొన్నలూరు మండల ప్రజలందరూ బాధపడుతున్నారు, అంబేద్కర్ గారి ఆశయాలను, సిద్ధాంతాలను, భావాలతోను నిండిన వ్యక్తులు మా జనసైనికులు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంబేద్కర్ గారి గురించి ప్రస్తావించకుండా ఎటువంటి సభ ముగించిన దాఖలాలు లేవు, కానీ మిగతా నాయకులు ఆయన వర్ధంతికి మరియు జయంతిలకు మాత్రమే ఆయన పేరు చెబుతూ ఉంటారు, ఈ కార్యక్రమంలో కనపర్తి మనోజ్ కుమార్, షేక్ ఖాజావలి, తిరుమల్ రెడ్డి, సుబ్రహ్మణ్యం నాయుడు, షేక్ బాషా, సుంకేశ్వరం శ్రీను, సాయి, వేణు, మాలకొండయ్య, షరీఫ్, గఫూర్, కిషోర్, శివ కిషోర్, ఆదర్శ, మహబూబ్ బాషా, గోపి, భార్గవ్ మొదలైనవారు పాల్గొన్నారు.