భవదీయుడు భగత్ సింగ్ లో పూజా హెగ్డే ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగత్ సింగ్ అనే సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా చేశారు. అలాగే స్టైలిష్ లుక్ లో పవన్ కళ్యాణ్ ని చూపిస్తూ ఫస్ట్ లుక్ ని కూడా రిలీజ్ చేశారు. అంతేకాకుండా ఈసారి ఇది కేవలం వినోదం మాత్రమే కాదు అంటూ ట్యాగ్ లైన్ కూడా ఇచ్చారు. ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే నటించబోతుందట. గతంలో హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన డీజే ,గద్దలకొండ గణేష్ సినిమా లో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. ఇప్పుడు ముచ్చటగా మూడవసారి సినిమాలో హీరోయిన్ గా నటించబోతుందని సమాచారం. కాగా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.