‘మా’ ఎన్నికల వేడిని మరింత పెంచిన పూనమ్ కౌర్..

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికల్లో ప్రకాశ్‌రాజ్ గెలవాలని తాను కోరుకుంటున్నట్టు నటి పూనమ్‌ కౌర్‌ తెలిపారు. అప్పుడే ఇంతకాలం తాను ఎదుర్కొన్న సమస్యల్ని చెప్పగలిగే అవకాశం ఉంటుందన్నారు. ఈ మేరకు ప్రకాశ్‌రాజ్‌తో కలిసి దిగిన ఫొటోని పంచుకుంటూ ఓ ట్వీట్‌ పెట్టారు. ”మా’ ఎన్నికల్లో ప్రకాశ్‌రాజ్‌ సర్‌ గెలవాలని కోరుకుంటున్నా. ఆయన విజయం సాధిస్తే ఇంతకాలం నేను ఎదుర్కొన్న సమస్యల్ని బయటపెడతా. ఆయన చిల్లర రాజకీయాలు చేయరు’ అని పేర్కొన్నారు. ప్రకాశ్‌రాజ్‌ ‘మా’ ఎన్నికల్లో అధ్యక్ష అభ్యర్థిగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అక్టోబరు 10న ఈ ఎన్నికలు జరగనున్నాయి. ‘శౌర్యం’, ‘గణేష్‌’, ‘గగనం’, ‘శ్రీనివాస కల్యాణం’ సహా పలు చిత్రాల్లో పూనమ్‌ కౌర్‌ నటించి మెప్పించారు. ప్రకాశ్‌రాజ్‌-పూనమ్‌ కలిసి ‘గగనం’ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటె మా ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో విష్ణు ప్యానల్ , ప్రకాష్ రాజ్ ప్యానల్ లు పోటాపోటీగా ప్రచారం చేస్తూ అందరి మద్దతు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో నటి పూనమ్ కౌర్ తన మద్దతును ప్రకాష్ రాజ్ కు తెలిపి మరింత హాట్ టాపిక్ అయ్యింది. ప్రకాష్ రాజ్‌కు మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించింది. ఆయన గెలవాలి, ఒకవేళ ఆయన గెలిస్తే ఎంతో కాలం నుంచి నేను మాట్లాడుకుండా నోరు మూసుకుని ఉన్నటు వంటి సమస్యలు, నేను పడిన బాధలన్నీ చెబుతాను. చిల్లర రాజకీయాలను చేయని ఏకైక వ్యక్తి ఆయనే. పెద్దలకు గౌరవం ఇస్తూ వారు చెప్పేదానికి కట్టుబడి ఉంటాడు అని చెప్పుకొచ్చింది.