ఎన్నిక‌లు వాయిదా: పోస్ట‌ల్ ఓటింగ్‌తో త‌ప్పుడు ఫలితాలూ

అమెరికాలో న‌వంబ‌రులో జ‌ర‌గాల్సిన అధ్య‌క్ష ఎన్నిక‌లను వాయిదా వేయాల‌ని అమెరికా అధ్య‌క్షుడు డోన‌ల్డ్ ట్రంప్ సూచించారు. పోస్ట‌ల్ ఓటింగ్‌తో త‌ప్పుడు ఫలితాలూ రావొచ్చ‌ని ఆయ‌న అన్నారు.

క‌రోనావైర‌స్ ఉదృతి అనంతరం ప్ర‌జ‌లంద‌రూ సుక్షితంగా, భ‌ద్ర‌తంగా, మునుప‌టిలా ఓటు వేసే స‌మ‌యం వ‌చ్చేవ‌ర‌కూ ఎన్నిక‌ను వాయిదా వేయాల‌ని ఆయ‌న సూచించారు.

ట్రంప్ చెబుతున్న లోపాల‌కు ఎలాంటి గ‌ట్టి ఆధారాలూ లేవు. పైగా పోస్ట‌ల్ ఓటింగ్‌ను ఆయ‌న విమ‌ర్శించడం ఇదేమీ తొలిసారి కాదు. క‌రోనావైర‌స్ వ్యాప్తి చెందుతుండ‌టంతో పోస్ట‌ల్ ఓటింగ్ విధానాన్ని మ‌రింత స‌ర‌ళం చేయాల‌ని అమెరికాలోని రాష్ట్రాలు భావిస్తున్నాయి.

అమెరికా రాజ్యాంగం ప్ర‌కారం.. ఎన్నిక‌లను వాయిదావేసే అధికారం అధ్య‌క్షుడికి లేదు. ఎలాంటి వాయిదా అయినా కాంగ్రెస్ ఆమోదంతోనే చేయాల్సి ఉంటుంది. ఈ రెండు స‌భ‌ల‌పై అధ్య‌క్షుడికి ఎలాంటి ప్ర‌త్య‌క్ష అధికారాలూ ఉండ‌వు.