ప్రశాంతి పెన్షన్ రద్దును సమర్దించిన వెలంపల్లి వ్యాక్యలను ఖండించిన పోతిన మహేష్

జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్ తన కార్యాలయం నుంచి విడుదల చేసిన వీడియో ద్వారా మాట్లాడుతూ
43 డివిజన్ లో దివ్యాంగురాలు ప్రశాంతి పెన్షన్ రద్దు చేయడం సబబు అని మాట్లాడడానికి స్థానిక ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు కనీసం మానవత్వం జాలి దయ చూపకుండా 18 సంవత్సరాల నుంచి పెన్షన్ తీసుకుంటున్న ప్రశాంతికి పెన్షన్ రద్దు చేయడం సబబు అని మాట్లాడడానికి సిగ్గు ఉండాలని, ముందు 43 డివిజన్ వైఎస్ఆర్ సీపీ అధ్యక్షులు కంది శ్రీనివాస్ రెడ్డి తమ్ముడు స్వయానా 43 వ డివిజన్ కార్పొరేటర్ కోటిరెడ్డి తోడల్లుడు కంది నారాయణ రెడ్డి చేసిన ఆర్.పి వ్యవహారంపై ఎందుకు స్పందించలేదన్నారు. వారం రోజుల కిందట ఈ వ్యవహారాన్ని సాక్షి ఛానల్ లో కూడా ప్రచారం చేశారన్నారు.