అధికార మార్పిడి జరగాలని, జనసేన-టిడిపి సంకీర్ణ ప్రభుత్వం రావాలని శ్రీ రాజశ్యామల యాగం: బొర్రా

సత్తెనపల్లి, జనసేన టిడిపి సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి రావాలని, అధికార మార్పిడి జరగాలని పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలని గత ఐదు రోజులుగా చేస్తున్న శ్రీ రాజశ్యామల యాగం నేటితో ముగిసిందని జనసేన సత్తెనపల్లి సమన్వయకర్త బొర్రా వెంకట అప్పారావు తెలిపారు. ఈ నెల 5వ తారీఖున నకరికల్లు మండలం చేజెర్ల కపోతేశ్వరాలయంలో జరిగిన శ్రీరాజశ్యామల యాగం. గర్నేపూడి నుండి చేజర్ల వరకు సాగిన పాదయాత్ర అనంతరం యాగాన్ని ప్రారంభించిన బొర్రా. చివరి రోజు యాగంలో ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన జనసేన నాయకులు భారీగా పాల్గొన్నారు. పదివేల మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించామని బొర్రా తెలిపారు. ఈ రాజ్యసభ యాగం ముగిసిన అనంతరం బొర్రా వెంకట అప్పారావు మాట్లాడుతూ జనసేన తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావాలని పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ప్రజలందరికీ మంచి పాలన అందించాలని మనస్పూర్తిగా కోరుకున్నాము. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని రాష్ట్రంలో అధికారమార్పిడి జరిగి మంచి ప్రభుత్వం వచ్చి మంచి పాలన జరిగి మంచి పనులు అందించాలని యాగం చేశాము. రాజశ్యామల యాగం చేయటం వల్ల మేమే కాకుండా సత్తెనపల్లి నియోజకవర్గంలో ప్రజలు సస్యశ్యామలంగా ఉండాలని చేశాము. గర్నేపూడి నుండి చేజర్ల వరకు పాదయాత్రలో సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నేనిక్కడికి వచ్చేవరకు నా, నీ అని కొంతఉంది. నేను చేజర్ల గుడికి వచ్చి దర్శనం చేసుకున్న తర్వాత తర్వాత నా,నీ కంటే మనము అని బతకడంలోనే అర్థం ఉందని అనిపించింది. మనము అనేది వచ్చింది. స్వచ్ఛందంగా వాళ్ళంతట వాళ్లే వచ్చి, పూజ, కోలాట అన్ని కార్యక్రమాలలో సహకరించిన చేజర్ల, కుంకలగుంట గ్రామ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు. చేజర్ల కపోతేశ్వర స్వామికి చేజర్ల ప్రజలకు రుణపడి ఉంటాను. చేజర్ల గుడికి వచ్చి దర్శనం చేసుకున్న తర్వాత ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి & నరసరావుపేట నియోజకవర్గ ఇంచార్జి సయ్యద్ జిలాని, కటకం అంకారావు గురజాల నియోజకవర్గ సమన్వయకర్త, ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మిశెట్టి వెంకట సాంబశివరావు, సెంట్రల్ ఆంధ్ర కో కన్వీనర్ గుంటూరు జిల్లా కార్యదర్శి నిశ్శంకర శ్రీనివాసరావు, జనసేన డెవలప్మెంట్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు మండలనేని శ్రీనివాసరావు ఖాసిం సైదా ఉమ్మడి గుంటూరు జిల్లా కార్యదర్శి, మండల అధ్యక్షులు పొనపాల నరసయ్య రాత్లావత్ హనుమాన్ నాయక్ వేముల వెంకటేశ్వర్లు పల్నాడు జిల్లా క్స్స్ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, సత్తెనపల్లి పట్టణ ఏడో వార్డు కౌన్సిలర్ రంగిశెట్టి సుమన్, ప్రోగ్రామింగ్ కమిటీ సభ్యులు బత్తుల కేశవ, సత్తనపల్లి మండల అధ్యక్షుడు నాదెండ్ల నాగేశ్వరరావు, నకరికల్లు మండల అధ్యక్షురాలు తాడువాయి లక్ష్మి శ్రీనివాస్, ముప్పాళ్ళ మండల అధ్యక్షులు సిరిగిరి పవన్ కుమార్, రాజుపాలెం మండల అధ్యక్షులు తోట నరసయ్య, నరసరావుపేట జనసేన మండల ప్రధాన కార్యదర్శి మిరియాల సుబ్బమ్మ జనసేన మహిళ అధ్యక్షురాలు శివలీల ఉపాధ్యక్షురాలు నిర్మల మహిళ కార్యదర్శి శ్రావణి వీరమహిళా పద్మావతి, నరసరావుపేట నాయకులు బెల్లంకొండ అనీల్, సత్తెనపల్లి మండలం షేక్ రఫీ, చిలకా పూర్ణ, గంజి నాగరాజు, మాజీ ఎంపీటీసీ శివ, తోట రామాంజినేయులు, షేక్ కన్నా, సురేష్, ఏసుబాబు, రుద్రజడ ఆంజనేయులు, రుద్రజాడ బుల్లి అబ్బాయి, శేషు, పసుపులేటి వేంకటేశ్వర్లు, పోకల శ్రీను, షేక్ రఫీ, పసుపులేటి మురళి, నక్క వెంకటేశ్వర్లు, షేక్ మీరవలి, కొడమల శ్రీను, నామాల పుష్ప, గట్టు శ్రీదేవి, మెద్దెం మహాలక్ష్మి, అంకారావు, నాయకులు, వీర మహిళలు, తెలుగుదేశం పార్టీ, నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.