మరో బాలీవుడ్ ప్రాజెక్టును ఓకే చేసిన ప్రభాస్!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సాలిడ్ లైనప్ చూసి బాలీవుడ్ ఇండస్ట్రీ కూడా అవాక్కయేలా ఉంది. ప్రభాస్ చేస్తున్న సినిమాలా లిస్టు మాములుగా లేదు మరీ. ఇప్పటికే ప్రభాస్ తన 20వ చిత్రంగా జిల్ ఫేం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రాధే శ్యామ్ చిత్రాన్ని చేయగా ఈ మూవీ జూలై 30న విడుదల కానుంది. ఇక తన 21వ చిత్రంగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ అనే సినిమా చేస్తున్న ప్రభాస్, 22వ సినిమాగా ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ చిత్రాన్ని చేస్తున్నాడు. ఇక నాగ్ అశ్విన్ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో ప్రభాస్ తన 23వ మూవీ చేయనుండగా, తాజాగా 24వ సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

ఈ సినిమాలన్నీ కూడా ఒకదానికొకటి ఎంతమాత్రం దగ్గర సంబంధం లేనివే. ఒక్కోక్కటి ఒక్కో జోనర్ కి చెందినవే. ఈ నేపథ్యంలోనే.. వార్ వంటి భారీ యాక్షన్ సినిమాను తెరకెక్కించిన సిద్ధార్థ్ ఆనంద్ రీసెంట్‌గా ప్రభాస్‌ని ఆదిపురుష్ సెట్‌లో కలిసి స్టోరీ నరేట్ చేయగా, ఇది డార్లింగ్‌కు నచ్చడంతో వెంటనే ఓకే చెప్పేశాడట. అతి త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుంది. మరోవైపు ప్రభాస్ తన 25వ సినిమాని దిల్ రాజు నిర్మాణంలో కొరటాల శివ దర్శకుడిగా చేస్తాడని గతంలో ప్రచారం నడిచిన విషయం తెలిసిందే. ఏదైమన ప్రభాస్ లైనప్ చూసి అరాచకం అంటే ఇది అని అంటున్నారు ఫ్యాన్స్.