వట్టిచెరుకూరు మండల జనసేన పార్టీ అధ్యక్షుడుగా ప్రత్తి భవన్నారాయణ నియామకం

వట్టిచెరుకూరు జనసేన పార్టీ మండల అధ్యక్షుడిగా ముట్లూరు గ్రామానికి చెందిన శ్రీ ప్రత్తి భవన్నారాయణని నియమించడం జరిగింది.
మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన మండల కమిటీ సమావేశంలో పార్టీ PACS చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా నియామకపత్రం అందుకోవడం జరిగిందని భవన్నారాయణ తెలియచేయడం జరిగింది. అలాగే భవన్నారాయన గారు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో మండలం మొత్తం తిరిగి జనసైనికులను అందరిని కలిసి పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తానని అన్నారు. అదేవిధంగా ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ప్రజలముందు ఎండగడతామని తెలియచేసారు. అదే విధంగా తన నియామకానికి సహకరించిన గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు శ్రీ గాదె వెంకటేశ్వరరావుకి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ కి, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ ఉప్పు వెంకట రత్తయ్యకి, జిల్లా కార్యదర్శి శ్రీ డేగల లక్ష్మణ్ కి మరియు వట్టిచెరుకూరు మండల జనసైనికులు అందరికి కృతజ్ఞతలు తెలియచేసారు.