నరసాపురం వారాహి సభ వాలంటీర్స్ కోర్ కమిటీ సన్నాహక సమావేశం

నరసాపురం నియోజకవర్గం: నర్సాపురంలో జరగబోయే వారాహి విజయ యాత్ర బహిరంగ సభ కోసంవాలంటీర్స్ గా పని చేయడానికి ముందుకు వచ్చిన నర్సాపురం జనసైనికులతో వాలంటీర్స్ కోర్ కమిటి సన్నాహక సమావేశం జరిగింది. దీనికి సహకరించి విలువైన సూచనలు అందించిన నరసాపురం నియోజవర్గ జనసేన పార్టీ పీఏసీ సభ్యులు రాష్ట్ర మత్స్యకార విభాగ చైర్మన్ బొమ్మిడి నాయకర్ కు మరియు వాలంటీర్స్ గా పని చేయడానికి ముందుకు వచ్చిన ప్రతీ జనసైనికుడికి వారాహి రాష్ట్ర విజయ యాత్ర కోర్ కమిటీ తరుపున జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శివదత్ బోడపాటి హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేసారు.