సహాయ చర్యలకు సిద్దం: తమిళిసై

రాష్ట్రంలో వర్షాలు, వరదల పట్ల అప్రమత్తంగా ఉండాలని గవర్నర్​ తమిళిసై సూచించారు. సహాయ చర్యలు చేపట్టేందుకు ఎన్డీఆర్‌ఎఫ్‌ సహా ఇతర సహాయ బృందాలు సిద్దంగా ఉన్నాయని ఆమె తెలిపారు. జిల్లాల వ్యాప్తంగా రెడ్‌క్రాస్‌ వాలంటీర్లు సహాయ చర్యల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. వర్షాల కారణంగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని గవర్నర్‌ తమిళిసై అన్నారు.