రాష్ట్రపతిని ఎయిమ్స్‌కు త‌ర‌లించాం: ఆర్మీ ఆసుప‌త్రి

రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నిన్న‌ ఉదయం ఛాతీలో నొప్పితో బాధ‌ప‌డ‌డంతో ఆయ‌న‌ను వెంటనే ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ ఆసుప‌త్రికి త‌ర‌లించిన విష‌యం తెలిసిందే. ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితిపై ఆ ఆసుప‌త్రి తాజాగా వివ‌రించింది. రాష్ట్రపతి కోవింద్‌ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆసుపత్రి వైద్యులు పేర్కొన్నారు.

కోవింద్‌కు మ‌రింత మెరుగైన‌ చికిత్స అందించ‌డానికి ఆయ‌న‌ను ఈ రోజు ఢిల్లీలోని ఎయిమ్స్‌కు త‌ర‌లించిన‌ట్లు ప్ర‌క‌టించారు. ఛాతీ నొప్పి కార‌ణంగా నిన్న ఆయ‌న‌ను ఆర్మీ ఆసుప‌త్రి వైద్యులు ప‌రిశీల‌న‌లో ఉంచి, చికిత్స అందించారు. మ‌రిన్ని వైద్య ప‌రీక్ష‌లు, చికిత్స కోసం ఎయిమ్స్‌కు త‌ర‌లించారు.