ఎస్పీ బాలు మృతి పట్ల రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాని సంతాపం

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతిపట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌, ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. బాలు కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

భారత సంగీతం ఓ గొప్ప స్వరాన్ని కోల్పోయింది అని రాష్ట్రపతి అన్నారు. పాటల చంద్రుడిగా ఎస్పీ బాలు అనేక పురస్కారాలు అందుకున్నారని కోవింద్ పేర్కొన్నారు.

మన సాంస్కృతిక ప్రపంచానికి బాలు మరణం పూడ్చలేని లోటు అని మోదీ పేర్కొన్నారు. బాలు స్వరం దశాబ్దాలుగా దేశంలో ఇంటింటా అలరించింది అని ప్రధాని తెలిపారు.

ఎస్‌పీ బాలసుబ్రహ్మణ్యం మృతిపట్ల ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు సంతాపం తెలిపారు. ఆయన మృతివార్త తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందన్నారు. సంగీత ప్రపంచంలో బాలు లేని లోటు పూరించలేనిదని చెప్పారు.