స్ఫూర్తి ప్రదాత బిర్సా ముండాకు ప్రధాని మోదీ నివాళులు

బీహార్‌ గిరిజన నాయకుడు దివగంత బిర్సా ముండా జయంతి సందర్భంగా.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ఆయనకు నివాళులర్పించారు. స్వాతంత్ర్య ఉద్యమంపాటు సామాజిక సామరస్యానికి భగవాన్ బిర్సా ముండా చేసిన కృషి ఎనలేనిదని మోదీ పేర్కొన్నారు. దీంతోపాటు ఈ రోజు జార్ఖండ్‌ అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఆ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్విట్ చేశారు.

పేదలు, అణగారిన వర్గాల అభ్యున్నతికి బిర్సా ముండా ఎనలేని కృషి చేశారని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. స్వాతంత్ర్య ఉద్యమంలో ఆయన చేసిన కృషి.. సామాజిక సామరస్యం కోసం బిర్సా ముండా చేసిన పోరాటం దేశవాసులకు ఎప్పుడూ స్ఫూర్తినిస్తాయని మోదీ ట్విట్టర్‌లో రాశారు.