కోవిడ్ వ్యాక్సీన్ రెండో డోసు తీసుకున్న ప్రధాని మోడీ

ఇండియాలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో వ్యాక్సిన్‌ డ్రైవ్‌ను ప్రభుత్వం వేగవంతం చేసింది. ప్రస్తుతం 45 ఏళ్లు నిండిన వారందరికీ కరోనా వ్యాక్సిన్‌ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ ప్రధాని మోడీ కరోనా రెండో డోస్‌ తీసుకున్నారు. ఢిల్లీల ఎయిమ్స్‌లో కోవాగ్జిన్‌ రెండో డోసు వేయించుకున్నారు. ప్రధాని మోడీకి పంజాబ్‌కు చెందిన నర్సు నిషా శర్మ వ్యాక్సిన్‌ ఇచ్చారు. వ్యాక్సిన్‌ వేసుకున్న విషయాన్ని ప్రధాని మోడీ ట్విట్టర్‌ వేదికగా పేర్కొన్నారు. కరోనా వైరస్‌ను నిర్మూలించేందుకు ఉన్న మార్గాల్లో వ్యాక్సిన్‌ కూడా ఒకటని ఆయన తెలిపారు. వ్యాక్సినేషన్‌కు అర్హులైన వారంతా టీకా వేసుకోవాలని.. అందుకోసం కోవిడ్‌ వెబ్‌సైట్‌లో రిజిస్టర్‌ చేసుకోవాలని సూచనలు చేశారు ప్రధాని మోడీ. కాగా…ప్రధాని మోడీ మొదటి డోస్‌ను గత నెల 1న వేయించుకున్నారు. రెండో దశ వ్యాక్సినేషన్‌ ప్రారంభమైన రోజే ఆయన వ్యాక్సిన్‌ తీసుకున్నారు.