తమిళ సూపర్‌స్టార్‌కు ప్రధాని మోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు

ప్రముఖ నటుడు, తమిళ సూపర్‌స్టార్‌ రజనీ కాంత్‌కు ప్రధాని మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సూపర్‌స్టార్‌ ఆయురారోగ్యాలతో కలకాలం జీవించాలని మోదీ ఆకాంక్షిస్తూ.. ఈమేరకు ప్రధాని ట్వీట్‌ చేశారు.

70వ పడిలోకి ప్రవేశించిన తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌కు ప్రధాని మోదీ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రియమైన రజనీ కాంత్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు కలకాలం ఆరోగ్యంగా ఉండాలి’ అని ట్వీట్‌ చేశారు. రజనీకాంత్‌ గత ఆగస్టులో 45 ఏండ్ల తన సినీ జీవితాన్ని పూర్తిచేసుకున్నారు. తాను ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రవేశిస్తున్నానని డిసెంబర్‌ 4న ప్రకటించారు. తమిళనాడులో కొత్త రాజకీయ పార్టీని ఈనెల చివర్లో ప్రకటిస్తామని తెలిపారు.