ఆస్తుల వివరాలను 15 రోజుల్లోగా ఆన్‌లైన్‌ చేయాలి

కొత్త రెవెన్యూ చట్టం అమల్లో భాగంగా తీసుకురానున్న ధరణి పోర్టల్ రూపకల్పనపై సీఎం కేసీఆర్ ప్రగతిభవన్‌లో నిన్న ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష లో బాగంగా గ్రామాలు, పట్టణాల్లో ప్లాట్లు, ఇళ్లు, ఇళ్ళ స్థలాలు అపార్ట్‌మెంట్స్ తోపాటు వ్యవసాయేతర ఆస్తుల వివరాలన్నింటినీ 15 రోజుల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు.

‘ధరణి’ పోర్టల్‌ అందుబాటులోకి వచ్చేలోగా మున్సిపల్‌, పంచాయతీరాజ్‌శాఖలకు చెందిన అన్నిస్థాయిల్లోని అధికారులు, సిబ్బంది ఇప్పటివరకు నమోదుకాని ఆస్తుల వివరాలను వందశాతం ఆన్‌లైన్‌ చేయాలని సూచించారు.