ఉప్పర వీధిలో వీధి కుక్కల నుంచి రక్షణ కరువు

  • జనసేన నాయకులు రాహుల్ సాగర్

ఎమ్మిగనూరు: ఉప్పర వీధిలో వీధి కుక్కల నుంచి కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందికి గురి అవుతున్నారని జనసేన నాయకులు రాహుల్ సాగర్ పేర్కొన్నారు. తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాహుల్ సాగర్ మాట్లాడుతూ సాయంత్రం రాత్రి వేళల్లో వీధిలో తిరగాలంటే వృద్ధులు, వికలాంగులు వాహనదారులు చాలా ఇబ్బందికి గురి అవుతున్నారని వెంటనే పురిపాలక అధికారులు వీధి కుక్కల పై దృష్టి సారించి సమస్యకు పరిష్కారం చూపాలని పేర్కొన్నారు.