పిఠాపురంలో హోరెత్తిన జనసేన నేతల అక్రమ అరెస్టుల నిరసన !!

  • విశాఖపట్నంలో జనసైనికుల అక్రమ అరెస్టులకు నిరసన
  • పిఠాపురం ప్రధాన కూడలి అయిన ఉప్పాడ బస్టాండ్ జంక్షన్ నందు వీరమహిళ, జనసైనికులతో డాక్టర్ శ్రీధర్ పిల్లా ధర్నా

పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ శ్రీధర్ పిల్లా శనివారం విశాఖపట్నంలో జనసైనికుల అక్రమ అరెస్టులకు నిరసనగా పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం ఉప్పాడ జంక్షన్ నందు ధర్నా నిర్వహించడం జరిగింది. అనంతరం డాక్టర్ శ్రీధర్ మీడియాతో మాట్లాడుతూ ఉత్తరాంధ్రని ఉద్ధరిస్తానంటూ విశాఖ గర్జన పెట్టడం దానికి సీఎం జగన్ మోహన్ రెడ్డి తప్ప మిగిలిన మంత్రిత్వ శాఖ మొత్తం అంతా విశాఖపట్నం రావడం జరిగింది. వీళ్ళు చేసే అరాచకం పాలన దౌర్జన్య పాలన ప్రకృతికి కూడా నచ్చక వర్షం పడి ప్రోగ్రాం అట్టర్ ప్లాప్ అయింది. దీనిని జీర్ణించుకోలేని వైసీపీ ప్రభుత్వం అదే సమయానికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విశాఖపట్నం రావడం జరిగింది. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి గర్జన కార్యక్రమానికి కూడా రానటువంటి జనం పవన్ కళ్యాణ్ విశాఖపట్నంలో అడుగు పెట్టగానే లక్షలాదిమంది తరలిరావడం చూసి ఓర్వలేని వైసీపీ ప్రభుత్వం గుండాలు వాళ్ల కాన్వయల మీద వాళ్లే రాళ్లు విసురుకుని దీన్ని జనసైనికులు చేశారంటూ హైడ్రామా క్రియేట్ చేసుకుని అర్ధరాత్రి ఏదో కొంపలు మునిగిపోయినట్లు నోవాటెల్ హోటల్లో నిద్రిస్తున్నటువంటి జనసైనికులను నాయకులను అక్రమంగా అరెస్టు చేయడం జరిగింది దీన్ని జనసేన పార్టీ నుంచి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. జనవాణి కార్యక్రమం జరిగివుంటే ఉంటే ఉత్తరాంధ్రని వీళ్ళు ఎంత తుక్కువ చేసారో అక్కడ వాళ్ళు చేసిన అన్యాయాలు అక్రమాలు దౌర్జన్యాలు పవన్ కళ్యాణ్ దృష్టికి వచ్చి ఉండేవని తద్వారా పవన్ కళ్యాణ్ తీసుకునే నిర్ణయాలకి వీళ్ళ తట్టుకోలేరని జనాల కూడా చీకటి డిపాజిట్లు కూడా రాని స్థితిలోకి వెళ్లిపోతారని, జనసేన నాయకులను అక్రమంగా అరెస్టులు చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన వాళ్ళను వెంటనే విడుదల చేయాలని, గుడివాడ అమర్నాథ్ అనలో అమర్నాథ్ రెడ్డి అనాలో తెలియదుగాని గాని పవన్ కళ్యాణ్ రా విశాఖపట్నం చూసుకుందాం అని అన్నాడు అదిగో సింహం విశాఖపట్నంలో ఉంది సింహం రా, చూసుకుందాం రా, ఆడదానిలా చీర కట్టుకుని ఇంట్లో కూర్చోవడం కాదు సింహాన్ని ఢీకొట్టుకునే ధైర్యం ఉంటే రా పవన్ కళ్యాణ్ మీద చేయబడితే దీపావళి ముందే వచ్చేద్ది రాష్ట్రమంతా అల్లకల్లోలం అయిపోద్ది అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన డాక్టర్ శ్రీధర్ పిల్లా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ యుద్ధం చేయాల్సి వస్తే శాంతి శాంతి అంటూ 99 సార్లు శాంతి మాత్రం జపించాలని చెప్పడం వల్ల జన సైనికులు సమయమనం పాటిస్తున్నారు. రెచ్చగొట్టే పనులు దిగజారుడు పనులు ఇంకెప్పుడూ చేయొద్దని లేకుంటే తగిన పరిణామాలు ఎదురుకోవాల్సి వస్తుందని ఇకమీదటైనా సంవత్సరం టైముంది జనంకోసం ఆలోచించి జనంకోసం మంచి పనులు చేయండి. కనీసం డిపాజిట్లు అయినా వస్తాయి లేదు మేము ఇలాగే వెళ్తాము పొడిచేస్తాం చించేస్తాం అంటే మాత్రం జనాలు చూస్తూ ఊరుకోరు గుడ్డలు ఇప్పతీసి కొడతారని మీడియా ముఖంగా చెప్తున్నాను. పోలీసు వ్యవస్థని వాళ్ల పనులు వాళ్లను చేసుకోనివ్వండి వాళ్ళేదో వైసిపి గుండాలగా మేము ఉక్కు జారీ చేస్తాము, మీరెల్లి చేయండి అంటే వాళ్ళు మనసు చంపుకొని చేస్తున్నారు. అధికారులు ఏరోజైతే మనస్ఫూర్తిగా ఉద్యోగం చేస్తారో ఆరోజే పూర్తి స్వతంత్రం వచ్చినట్టు మనం చూసుకోవాలి ఈరోజు ఏ ప్రభుత్వ ఉద్యోగులు మనస్పూర్తిగా ఉద్యోగం చేయట్లేదు వాళ్ల పనిని వాళ్ళని మనస్పూర్తిగా చేసుకునేలాగా మీరు ప్రజలకు మంచి చేయాలని కోరుకుంటూన్నట్లు డాక్టర్ శ్రీధర్ చెప్పడం జరిగింది. దీనిలో భాగంగా అధిక సంఖ్యలో జనసైనికులు పాల్గొని అక్రమ అరెస్టులకు నిరసనగా జనసైనికుల గళాలతో పిఠాపురం ఉప్పాడ బస్టాండ్ సెంటర్ దద్దరిల్లిపోయింది.