పెంచిన ఆర్టీసీ చార్జీలు తగ్గించాలని దేవర మనోహర ఆధ్వర్యంలో నిరసన

*పెంచిన ఆర్టీసీ చార్జీలు వెంటనే తగ్గించాలని జనసేన పార్టీ నాయకుల డిమాండ్

చంద్రగిరి నియోజకవర్గ హెడ్ కోటర్స్, చంద్రగిరి టవర్ క్లాక్ దగ్గర జిల్లా కార్యదర్శి దేవర మనోహర ఆధ్వర్యంలో శనివారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా దేవర మనోహర మాట్లాడుతూ.. ప్రజలపై బాదుడికి బ్రాండ్ అంబాసిడర్ మరియు 31 కేసులు ఉన్న సీబీఐ దత్తపుత్రుడు, చెత్త పై కూడా పన్ను వేసిన చెత్త పుత్రుడు.. అప్పెక్కడ పుడుతుందోనని వెతికే అప్పు పుత్రుడు జగన్ రెడ్డి అని ఎద్దేవా చేశారు.

వైసీపీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, గ్యాస్, విద్యుత్ చార్జీలు, నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెంచి సామాన్యులపై పెనుభారం మోపుతొందన్నారు. పెంచిన ఛార్జీలు తగ్గించకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్ కి, ఎమ్మార్వో మరియు ఎంపీడీవో కి సమర్పించారు.

రాష్ట్ర కార్యదర్శి ఆకేపాటి సుభాషిని మాట్లాడుతూ.. ఎడ్లబండి దశనుంచి మెట్రో వరకూ.. ఆధునిక దిశగా అడుగులు వేస్తున్న మనల్ని తిగిరి మళ్లీ అదే ఎడ్లబండి దశకు తీసుకెళ్తున్న వైసిపి ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ.. తక్షణమే ప్రభుత్వం స్పందించి పెంచిన ధరను తగ్గించాలని లేనిపక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని, ఇదే విధంగా కొనసాగితే వైసీపీ ప్రభుత్వాన్ని ఓఎల్ఎక్స్ లో పెట్టుకోవాల్సి వస్తుంది అని ఎద్దేవా చేశారు.

ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సంజీవి హరి, వినోద్ మరియు మండల నాయకులు మురళి, వేణు, ధరణి, ఐతేపల్లి సాయి, జనసేన సాయి, యువరాజ్, ఆశ, కిరణ్, శేఖర్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.