“పీపుల్స్ వాయిస్ ఆఫ్ జనసేన” తరపున ఆర్థిక సహాయం అందజేత

రాజమండ్రి జిల్లా కొత్తపేట నియోజకవర్గంకి చెందిన జనసైనికుడు గంప దుర్గా ప్రసాద్ (22) కూలి పనికి వెళ్లి దాహం వేసి తెలియక మందు డబ్బాలతో నీళ్లు త్రాగడంతో.. గొంతు మరియు కిడ్నీ దెబ్బ తిన్నకారణంగా.. దుర్గా ప్రసాద్ కు వైద్య ఖర్చుల నిమిత్తం “పీపుల్స్ వాయిస్ ఆఫ్ జనసేన” తరపున రూ 5000 ఆర్థిక సహాయం అందచేయడం జరిగింది. కార్యక్రమానికి అతిధులుగా కొత్తపేట ఇంచార్జి బండారు శ్రీను, జడ్పీటీసీ నాగేష్, ఎంపీటీసీ భాస్కర్ రావు విచ్చేసారు. ఈ కార్యక్రమంలో దుర్గా ప్రసాదు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.