మృత్యువుతో పోరాడుతున్న బీద కుటుంబానికి సాయం చేసిన పులి మల్లికార్జున

కందుకూరు నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త పులి మల్లికార్జున గుడ్లూరు మండలం చెమిడిదపాడు గ్రామంలో మృత్యువు తో పోరాడుతున్న ఒక బీద మహిళా కుటుంబానికి 10 వేల రూపాయల ఆర్థిక సాయం చేశారు. వివరాల్లోకి వెళితే స్థానిక గ్రామస్తుడు గంగోలు మాల్యాద్రి కధనం మేరకు గుడ్లూరు మండల జనసైనికులు ప్రోత్సాహంతో దాసరి ఆదెమ్మ అను వృద్ధురాలు వృద్ధాప్యం పైబడి, వారి కుటుంబం కడు బీద స్థితిలో ఉన్నది. పేదరికంతో అల్లాడుతూ, మృత్యువుతో పోరాడుతున్న ఆదెమ్మ ను, పులి మల్లికార్జున ఆదివారం రాత్రి పరామర్శించిన తదనంతర తెల్లవారుజామున ఆదెమ్మ పరమపదించారు. ఆయన సాయం చేసిన 10 వేల రూపాయలు ఆదెమ్మ అంత్యక్రియలకు ఉపయోగపడాల్సి రావడం కొంత బాధైనా, ఏదో ఒక కార్యక్రమానికి ఉపయోగపడతాయి అని సరిపెట్టుకుని ఆమె మృతికి తన ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ విచారం వ్యక్తం చేశారు. అంతకుముందుగా పులి మల్లికార్జున, తనతో విచ్చేసిన జనసైనికులు మరియు స్థానిక గ్రామస్తులతో కలిసి స్థానికంగా ఉన్న అంబేద్కర్ విగ్రహంనకు నమస్కారములు చేసి ఆయన ఆశయాలు, సేవలు, స్పూర్తిని కొనియాడారు. తదనంతరం ఆదెమ్మను పరామర్శించి, వారి కుటుంబంతో ముచ్చటిస్తూ బడుగు, బలహీన వర్గాల వారి బాధలు, కష్టాలు ఎలా ఉంటాయో గుర్తు చేశారు. రాజకీయాలకు అతీతంగా పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం తగు చర్యలు తీసుకోనే విధంగా అందరూ కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. తదనంతరం స్థానిక యువకులతో మమేకమై వారి యోగక్షేమాలు తెలుసుకుంటూ ఈ కందుకూరు నియోజకవర్గంలో ఎప్పటినుంచో ఏలుబడి చేస్తున్న రెండు ప్రధాన సామాజిక వర్గాలను కాదనీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు నాకు ఇక్కడ అవకాశం ఇచ్చారు అని, “డబ్బు రాజకీయాలు లాంటి గబ్బు రాజకీయాలు ” కాకుండా ప్రజలందరి ఆశీస్సులతో మంచి రాజకీయాలను ప్రజ్వరిల్లే విధంగా కృషి చేద్దాం అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కందుకూరు మండల అధ్యక్షులు జి. మదన్ కుమార్, ప్రచార కమిటీ కార్యదర్శి కె. సిద్ధయ్య గుడ్లూరు మండల జనసైనికులు మూలగిరి శ్రీనివాస్, అనిమిశెట్టి మాధవ రావు, అన్నంగి చలపతి, అమోస్, రాంబాబు, ఎం. రాజా ఉలవపాడు మండలం నుంచి ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.