జనసేనాని బస్సు యాత్ర కి ఆంజనేయ స్వామి ఆశీస్సులు తీసుకున్న మత్స పుండరీకం

పార్వతీపురం, మన్యం జిల్లా, పాలకొండ నియోజకవర్గo,వీరఘట్టం మండలం, నడుకూరు గ్రామంలో ముందుగా ఆంజనేయ స్వామి మందిరంలో జనసేన అధ్యక్షులుపవన్ కళ్యాణ్ పేరిట ప్రత్యేక పూజా జరిపించారు. రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ అధికారం లోకి రావాలని, త్వరలో ప్రారంభం కానున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర కి ఆంజనేయ స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడు ఉండాలని కోరుకున్నారు. అనంతరం జనసేన పార్టీ క్రియా శీలక సభ్యుల పత్రాలు (కిట్లు) నామినిగా ఉన్న కార్యకర్తలకు పంపిణీ చేశారు.

క్రియాశీలక సభ్యులకు నామినీ గా ఉన్న కార్యకర్తలకు పార్టీ సిద్ధoతాలు గురించి వివరించారు. 5 లక్షల భీమాను, ప్రమాదంలో గాయపడిన వారికి 50,000 వరకు వైద్య ఖర్చులకు ఇన్సూరెన్సు కంపెనీ అందిస్తుంది అని.. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం వాలంటీర్ మత్స. పుండరీకం వివరించి చెప్పారు. జనసేన పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా, మన ప్రియతమ నాయకులు కొణిదల పవణ్ కల్యాణ్ గారు అనుసరిస్తున్న నూతన రాజకీయ ప్రస్తావన దేశ భవిష్యత్ కు ఉపయోగపడే విధంగా మనమందరం సమిష్టి కృషి తో పనిచేయాలని చెప్పారు. కార్యక్రమంలో కలిపిల్లి సింహచలం, చింత గోవర్ధన్, వాన కైలాష్, బి.పి.నాయుడు, కంటు మురళి,బి.సత్యనారాయణ, ఉంగటి శ్రీనివాసరావు, ఎం.కాశియ్య, ఎం.ఎరుకు నాయుడు, మత్స సన్యాసి నాయుడు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.