PUSHPA: దాక్షాయని ఫస్ట్ లుక్ రిలీజ్..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహద్ ఫాసిల్, సునీల్ ప్రధాన పాత్రల్లో, ఎర్ర చంద్రనం స్మగ్లింగ్ నేపథ్యంలో క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ “పుష్ప” తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మోస్ట్ అవైటెడ్ మూవీ విడుదలకు ఇంకా నెలరోజులు మిగిలి ఉంది. అప్పుడే బన్నీ అభిమానులు కౌంట్ డౌన్ మొదలు పెట్టేశారు. ఇక మేకర్స్ సైతం ప్రమోషన్ కార్యక్రమాలను సిద్ధమవుతున్నారు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా మొదటి భాగం “పుష్ప: ది రైజ్” పేరుతో క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. డిసెంబర్ 17న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే మేకర్స్ చిత్రం నుంచి మూడు పాటలను విడుదల చేయగా, అన్ని పాటలకూ మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ చిత్రంలో అనసూయ పాత్రను రివీల్ చేశారు మేకర్స్.

దాక్షాయణిగా అనసూయను పరిచయం చేస్తూ పోస్టర్ ను విడుదల చేశారు. దాక్షాయణిని అహంకారం నిండిన మహిళ పాత్రను పోషిస్తోంది. ఆ పోస్టర్ లోనే ద్రాక్షాయని అహంకారం ఉట్టిపడుతోంది. సుకుమార్ దర్శకత్వంలో గతంలో వచ్చిన హిట్ మూవీ ‘రంగస్థలం’లో రంగమ్మత్తగా ఆమె కెరీర్లో మరిచిపోలేని రోల్ లో కన్పించిన అనసూయ దాక్షాయణిగా ప్రేక్షకుల్లో ఎలాంటి ముద్రను వేసుకుంటుందో చూడాలి.