మళ్లీ పట్టాలెక్కిన ‘పుష్ప’ షూటింగ్

స్టైలిష్ స్టార్అల్ల అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ ‘పుష్ఫ’. కరోనా కారణంగా ఈ మూవీ సుదీర్ఘంగా వాయిదా పడింది. కరోనా లాక్ డౌన్ అన్ లాక్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత మళ్లీ సినిమా షూటింగులను చిత్ర యూనిట్ ప్రారంభించింది.

అయితే చిత్ర యూనిట్ లో ఇద్దరికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో మళ్లీ షూటింగ్ ఆగిపోయింది. కరోనా సోకిన వారు కోలుకోవడంతో.. తాజాగా హైదరాబాదు నగర శివారులోషూటింగులు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం.