పూతలపట్టు నియోజకవర్గ జనసేన పార్టీ సమావేశం

పూతలపట్టు నియోజకవర్గం: పూతలపట్టు నియోజకవర్గ జనసేన పార్టీ సమావేశం బంగారుపాళ్యం జనసేన పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో పూతలపట్టు నియోజకవర్గం నుండి జనసేన పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా కమిటీ సభ్యులు, మండల అధ్యక్షులు, మండల కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ప్రతి మండలంలో కొత్తగా ఐదు పంచాయతీలకు బూత్ స్థాయి కమిటీలు నిర్ణయించి, పార్టీ ఆమోదయోగ్యం తెలిపింది, ఈ నెలతో దాదాపుగా 60 శాతం పంచాయతీ కమిటీలను ఏర్పాటు చేసుకున్నట్లు జిల్లా ప్రధాన కార్యదర్శి, నియోజకవర్గ పరిశీలకులు నరిగన్నగారి తులసి ప్రసాద్ తెలియజేశారు. జిల్లా కార్యదర్శి ఏపీ శివయ్య మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరిని పార్టీ సిద్ధాంతాలకు దగ్గర చేసి, ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. అలానే స్థానిక మండల అధ్యక్షుడు కోటి చంద్రయ్య మాట్లాడుతూ.. పార్టీలో ఉన్న యువశక్తిని ఉపయోగించుకొని ప్రతిపక్ష పార్టీలకు దీటుగా ఎదుగుతుందని తెలియజేశారు. యాదమరి మండల అధ్యక్షులు కుమార్ మాట్లాడుతూ.. మండలంలోని రహదారి సమస్యల మీద ప్రభుత్వంతో అనేక పర్యాయాలు చర్చలు జరిపారని, కానీ ఇటువంటి ఫలితం రావడంలేదని ఈ రహదారి సమస్య వల్ల ప్రజలు నరకయాతన పడుతున్నారని తెలియజేశారు. ఐరాల మండల అధ్యక్షులు పురుషోత్తం మాట్లాడుతూ.. మండలంలో నాయకత్వాన్ని బలపరుస్తూ ప్రతి ఐదు పంచాయతీలకు ఒక ఇన్చార్జి నియమించినట్టు తెలియజేశారు. తవణంపల్లి మండల అధ్యక్షులు శివ మాట్లాడుతూ.. కొత్తగా ఐదు పంచాయతీల్లో జండా ఆవిష్కరణకు నిర్ణయించినట్లు అలానే పంచాయతీ కమిటీలు ఏర్పాటు చేసి పార్టీని బలంగా ప్రజల్లోకి తీసుకు వెళ్తున్నారని తెలియజేశారు. పూతలపట్టు మండల అధ్యక్షులు మాట్లాడుతూ మండలంలో జరుగుతున్న అక్రమాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ యువతలో ఉత్తేజాన్ని నింపుతూ.. మండలంలో పార్టీని ప్రజల్లోకి తీసుకు వెళ్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తవణంపల్లి మండల ఉపాధ్యక్షులు శివ పుట్టినరోజు వేడుకలను మండల ఉపాధ్యక్షులు బాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గౌరవ అధ్యక్షులు శాంతమూర్తి, మండల ఉపాధ్యక్షులు శ్రీను, నవీన్, వెంకటేష్, అజిత్, మండల కార్యదర్శిలు చందు, గిరి, బాను, రెడప్ప మరియు జనసైనికులు పాల్గొన్నారు.