గడప గడపకు వైసీపీ అని వచ్చే నాయకులను ప్రజలు అడగవలసిన ప్రశ్నలు

*మాదాల శ్రీరాములు అరకు నియోజకవర్గం సమన్వయకమిటీ సభ్యులు

  1. ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ఎక్కడ ?
  2. మద్యపాన నిషేధం ఎక్కడ? నాసిరకం మద్యం ఎందుకు అమ్ముతున్నారు?
  3. ప్రత్యేక హోదా ఎక్కడ ?
  4. ఇసుక ధరలు ఎందుకు పెంచారు ?
  5. పోలవరం ప్రాజెక్ట్ పరిస్థితి ఏంటీ?
  6. గుంతల రోడ్ల పరిస్థితి ఏంటి ?
  7. కడప స్టీల్ ప్లాంట్ ఎక్కడ?
  8. కొత్త పరిశ్రమలు ఎక్కడ?
  9. జాబ్ క్యాలెండర్ ఎక్కడ ?
  10. కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులేషన్ ఎక్కడ?
  11. సి.పి.ఎస్ రద్దు పరిస్థితి ఏంటి?
  12. కార్పొరేషన్ లోన్స్ ఎందుకు ఇవ్వటం లేదు ?
  13. పేదల ఇంటి బిల్లులు ఎందుకు ఇవ్వటం లేదు?
  14. కరెంట్ కోతలు ఎందుకు ? కరెంటు బిల్లులు ఎందుకు పెంచారు ?
  15. ఆర్టీసీ ఛార్జీలు ఎందుకు పెంచారు!
  16. నిత్య అవసరాల ధరలు ఎందుకు పెరుగుతున్నాయి ? ఎందుకు ధరలు అదుపు చేయలేక పోయారు?
    17.పెట్రోలు, డీజిల్, సిమెంట్, స్టీల్ ధరలు ఎందుకు విపరీతంగా పెంచారు?
  17. పేదల కోసం పెట్టిన అన్నా క్యాంటీన్ ఎందుకు మూసివేశారు?
  18. నిరుద్యోగ భృతి ఎందుకు నిలిపివేశారు ?
  19. పేదల కోసం ఇచ్చే పెళ్ళికానుక ఎందుకు ఆపారు?
  20. ఎన్.ఎస్.డి.సి లోన్స్ ఎందుకు ఆపారు?
  21. చంద్రన్న భీమా లేదా వైఎస్సార్ భీమా ఎక్కడ?
  22. రేషన్ ద్వారా సన్న బియ్యం ఇస్తామని చెప్పి ఎందుకు ఇవ్వటం లేదు?
  23. ఎస్సీ, ఎస్టీ మహిళలకు 45 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని చెప్పి ఎందుకు ఇవ్వటం లేదు?
  24. తెలుగు రాష్ట్రంలో తెలుగు భాష లేకుండా ఎందుకు చేయబోతున్నారు?
  25. అభయ హస్తం డబ్బులు ఎక్కడా ?
    27 టిడ్కో ఇళ్ళు 3 సంవత్సరాలు ఎందుకు ఇవ్వలేదు? ఇంకెప్పుడిస్తావ్? అసలిస్తావా? ఇవ్వవా? నీఉద్దేశ్యం ఏంటి? ఎన్నికలకు ప్రచారం కోసం వాడుకుంటావా?
  26. ఎయిడెడ్ విద్యాసంస్థల పరిస్థితి ఏంటి? చేతకానప్పుడు ఎందుకు టచ్ చేశావ్?
  27. రైల్వేజోన్, పులిచింతల, హంద్రీనీవా, పోలవరం, ఇవన్నీ నీవల్ల అవుతాయని ఇంకా జనాన్ని నమ్మిస్తావా?

గడప గడపకి వైఎస్సార్సీపీ పేరుతో మీ ఇంటికి వచ్చిన ప్రతి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేని , ప్రతీ వైఎస్సార్సీపీ నాయకున్నీ కాలర్ పట్టుకుని అడగండి..అని అరకు నియోజకవర్గం సమన్వయకమిటీ సభ్యులు మాదాల శ్రీరాములు తెలియ జేశారు.