అలసత్వం వీడి ఇకనైనా జగనన్న కాలనీలను పూర్తి చేయండి

  • జనసేన పార్టీ ఇంచార్జి బొటుకు రమేష్ బాబు డిమాండ్

దర్శి నియోజకవర్గంలో జగనన్న కాలనీల పరిశీలన కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఆదివారం దర్శి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్‌ఛార్జ్‌ బొటుకు రమేష్ బాబు ఆధ్వర్యంలో తాళ్లూరు మండల కమిటీ అధ్యక్షులు కూటాల ప్రసాద్, స్థానిక నాయకులు జాస్తి కృష్ణ, సూది అనిల్ కుమార్, భూయేసు, కూటాల రామాంజనేయులు, చెన్నంశెట్టి కిషోర్, పసుపులేటి కృష్ణ, కూటాల పవన్, బి ఆంజనేయులు, సానే అశోక్ మరియు ముండ్లమూరు మండల కమిటీ అధ్యక్షులు తోట రామారావు, కురిచేడు మండల కమిటీ అధ్యక్షులు మాదా వెంకట శేషయ్య, ఉపాధ్యక్షులు మంచాల నరసింహారావు, దర్శి నగర పంచాయితీ కమిటీ అధ్యక్షులు చాతిరాశి కొండయ్య, మండల కమిటీ నాయకులు ఉప్పు ఆంజనేయులులతో కలిసి తాళ్లూరు మండలంలోని తాళ్లూరు గ్రామము మరియు తూర్పు గంగవరం జగనన్న కాలనీలను సందర్శించారు. ఈ సందర్భంగా బొటుకు రమేష్ బాబు మరియు కూటాల ప్రసాద్ మాట్లాడుతూ జగనన్న కాలనీలపై ప్రభుత్వం చిన్న చూపు చూపుతున్నదని, ఇది శోచనీయమని అన్నారు. పేద ప్రజలకు కనీస అవసరాలైన నిలువ నీడను కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. కనీస అవవసరాలు కల్పించకుండా అట్టహాసంగా జగనన్న కాలనీలను ప్రారంభించిన ప్రభుత్వం వాటి నిర్మాణంలో అలసత్వం వహించడం బాధాకరమన్నారు. అమలు చేయలేని వాగ్దానాలు చేయడం ప్రజలను మభ్యపెట్టడమేనని అన్నారు. అధికారంలోకి రావడానికి నవరత్నాల పేరుతో వాగ్దానాలు ఇచ్చారని, వచ్చిన తర్వాత అమలు చేయలేక ప్రజలను అవస్థలపాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. చిత్తశుద్ధి ఉంటే ఏ పనైనా విజయవంతంచేయవచ్చని, కాలయాపన చేయకుండా జగనన్న కాలనీలను నాణ్యంగా పూర్తిచేసి లబ్దిదారులకు ఇవ్వాలని, అర్హులైన వారందరికీ నిస్పక్షపాతంగా నిలువనీడ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.