మైలవరం మండలంలో జనసేన రచ్చబండ కార్యక్రమం

పుల్లూరు: జనసేనపార్టీ మైలవరం మండల అధ్యక్షులు శీలం బ్రహ్మయ్య ఆధ్వర్యంలో పుల్లూరు గ్రామపంచాయతీ లోని దాసుళ్లపాలెం, బాడవ, కొత్తగూడెం గ్రామాలలో రచ్చబండ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ రాష్ట్రఅధికార ప్రతినిధి మరియు మైలవరం నియోజకవర్గ ఇన్చార్జి అక్కల రామ్మోహన్ రావు(గాంధీ) ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ గ్రామ గ్రామాన బలపడుతుందని, ప్రజలంతా ప్రత్యామ్నాయ శక్తిగా జనసేన పార్టీకి ఓటు వేయాలని ఎదురుచూస్తున్నారని, 2024 ఎన్నికల్లో జనసేన గెలుపే లక్ష్యంగా మీరంతా మద్దతు తెలియజేయాలని ప్రజలను కోరారు. ఈ రోజుల్లో ఏ రాజకీయ నాయకుడు కూడా తన సొంత కష్టార్జితాన్ని డబ్బును పలు సేవా కార్యక్రమాలు ఉపయోగించటం లేదని, అలాంటిది పవన్ కళ్యాణ్ కౌలు రైతులను దృష్టిలో ఉంచుకొని, ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు లక్ష రూపాయలు చొప్పున 30 కోట్ల రూపాయలతో మూడు వేల మంది కౌలు రైతులు తన సొంత డబ్బులు ఇస్తున్నారని, ఇలాంటి నిజాయితీగల నాయకులను ప్రజలు గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.75 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఈ ఆంధ్ర ప్రదేశ్ కేవలం రెండు కుటుంబాలకు పరిమితం అయిపోయింది అని,అభివృద్ధి అనగారిపోయిందని, ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ జనసేనపార్టీ గ్రామస్థాయిలో బలపడుతుందని తెలియజేశారు. ఈ సందర్భంగా గ్రామప్రజలు పలు సమస్యలను గాంధీ దృష్టికి తీసుకురావడం జరిగింది. జనసేన పార్టీ మీకు అండగా ఉంటుందని, సమస్యలపైన పోరాటమే జనసేన ఎజెండా అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ కృష్ణాజిల్లా కార్యదర్శి చింతల లక్ష్మి కుమారి, జనసేనపార్టీ మైలవరం మండల ఉపాధ్యక్షులు గుమ్మడి శ్రీనివాసరావు, పడిగెల ఉదయ్ మండల నాయకులు ఈతకొట్టు నాని, ఆనం విజయ్ కుమార్, మల్లారపు దుర్గాప్రసాద్, పార్టీఆఫీస్ మేనేజర్ దొండా రమేష్ బాబాయ్, స్థానిక నాయకులు, జనసైనికులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.