రెండో పెళ్లికి సిద్దమైన దర్శకేంద్రుడు మాజీ కోడలు

శతాధిక చిత్రాల దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కుమారుడు ప్రకాష్ కోవెల మూడి గతంలో ప్రముఖ స్క్రీన్ రైటర్ కనికా ధిల్లాన్‌ని వివాహం చేసుకున్న సంగతి విదితమే. కొన్నాళ్ల పాటు వీరి దాంపత్యం సజావుగా సాగిన మధ్యలో వచ్చిన మనస్పర్ధల వలన ఇరువురు విడాకులు తీసుకున్నారు. దీంతో కనికా మరో రచయిత హిమాన్షు శర్మని వివాహం చేసుకునేందుకు సిద్దమైంది. కొన్నాళ్ళుగా ప్రేమలో మునిగి తేలుతున్న కనిక, హిమాన్షు రీసెంట్‌గా నిశ్చితార్ధం జరుపుకున్నారు.

కుటుంబ సభ్యుల మధ్య జరిగిన నిశ్చితార్ధానికి సంబంధించిన ఫొటోలను కనికా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ నేపథ్యంలో నెటిజన్స్‌తో పాటు పలువురు సెలబ్రిటీలు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ‘జడ్జిమెంటల్ హై క్యా’, ‘మన్మర్జియాన్’ సినిమాలకు రచయితగా పని చేసింది కనికా. జడ్జిమెంటల్ హై క్యా’ చిత్రానికి ప్రకాష్ దర్శకత్వం వహించగా, కనికా కథని అందించడం విశేషం. ఇక ఇప్పుడు కనికా చేసుకుబోయే భర్త హిమాన్షు .. తను ‘వెడ్స్ మను’, ‘రాణీజానా’, ‘జీరో’ చిత్రాలకు కథ అందించారు. కొంత కాలం స్వర భాస్కర్‌తో ప్రేమాయణం నడిపిన ఆయన ఆమెకు గుడ్ బై చెప్పి కనికాని వివాహం చేసుకునేందుకు సిద్దమయ్యారు.