రఘునందన్‌రావు ప్రమాణస్వీకారం

దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాల్లో ఉపఎన్నికలో విజయకేతనం ఎగురవేసిన బీజేపీ అభ్యర్థి రఘనందన్‌రావు మొదటి సారిగా అసెంబ్లీలో అడుగు పెట్టనున్నాడు. అయితే.. ఎమ్మెల్యేగా రఘనందన్‌రావు ప్రమాణస్వీకారం చేసేందుకు ముహుర్తం ఫిక్స్‌ అయింది. ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంటకు స్పీకర్‌ ఛాంబర్‌లో దుబ్బాక ఎమ్మెల్యేగా రఘనందన్‌రావు ప్రమాణస్వీకారం చేయనున్నారు. కాగా.. ముందుగా సర్వేలు చెప్పినట్టుగానే బీజేపీ దుబ్బాకలో ఘన విజయం సాధించింది. కాగా, అటు మొన్న గవర్నర్‌ కోటాలో ఎన్నికైన ఎమ్మెల్సీలు కూడా ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.