పూలే వర్ధంతి సందర్భంగా రాజాం జనసేన ఘన నివాళి

రాజాం: సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా రాజాం జనసేన పార్టీ ఆధ్వర్యంలో నియోజకవర్గ నాయకులు ఎన్ని రాజు ఆదేశాల మేరకు శుక్రవారం జనసైనికులు ఆ మాతృమూర్తికి ఘనమైన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్త్రీల విద్యాభివృద్ధి, హక్కుల కోసం కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి సావిత్రిబాయి పూలేకు ఘన నివాళులు తెలిపుతూ సమాజంలో అసమానతలు మీద అలుపెరగని పోరాటం చేసి, మహిళా హక్కుల కోసం విశేష కృషి చేసిన వీర వనిత అని, మహాత్మ జ్యోతిరావు పూలే అడుగుజాడల్లో నడుస్తూ నిత్యం ఆయన మార్గంలో తోడుగా వున్నారని, మొట్టమొదటి భారతదేశ మహిళ ఉపాధ్యాయురాలుగా, మహిళా అక్షరాస్యులుగా, రచయిత్రిగా ఆమె సేవలు మరువలేనివని మహనీయులను స్మరించుకుందాం, వారి ఆశయాలను కొనసాగిద్దామని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వీరప్రవీణ్, అప్పలనాయుడు, జన, గవరయ్యా, శ్రవణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.