రాజోలు చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ సేవలు

ది.20-7-21,మంగళవారం. ప్రాణాలను నిలిపే ప్రాణవాయువు – చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్. మెగాస్టార్ చిరంజీవి గారు  రాజోలు లో ఏర్పాటు  చేసిన  ఆక్సిజన్ బ్యాంకు నందు నిర్విరామంగా సేవలు కొనసాగుతూనే ఉన్నాయి.

మలికిపురం మండలం తూర్పుపాలెం గ్రామానికీ చెందిన గాలిదేవర శ్రీనివాస గారికి ఆక్సిజన్ అవసరం అవడంతో దిరిశాల బాలాజీ గారిని సంప్రదించగా.. బాలాజీ గారు రాజోలు ఆక్సిజన్ బ్యాంకుకు తెలియపరచడంతో గాలిదేవరా శ్రీనివాస్ గారి సంబంధిత బంధువులకు నిన్న (మంగళవారం)ఆక్సిజన్ సిలెండర్ ను ఇవ్వడం జరిగింది..

#ChiranjeeviOxygenBanks

#GiveOxygenGiveLife