పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని ఎస్.కోటలొ ర్యాలీ, రాస్తారోకో

జనసేన ఆధ్వర్యంలో పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని ఎస్.కోటలొ ర్యాలీ, రాస్తారోకో జరిగింది. గురువారం సాయంత్రం 7 గంటల నుండిస్థానిక సాయిబాబా గుడి వద్ద నుండి ర్యాలీగా బయల్దేరి వన్ వే ట్రాఫిక్ వరకు ర్యాలీగా వెళ్లి దేవి బొమ్మ కూడలిలో రాస్తారోకో నిర్వహించారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని, కరెంట్ కోతలు నివారించాలని వారు నినాదాలు చేస్తూ.. జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో ఎస్ .కోట జనసేన నియోజకవర్గ నాయకులు వబ్బిన సన్యాసినాయుడు, వబ్బిన సత్తిబాబు,పెదిరెడ్ల రాజశేఖర్, గంధవరపు సతీష్, మల్లు వలస శ్రీను, అలమండ రాంబాబు, అరిగి సన్యాసిరావు , చిన్ని, జొన్నపల్లి సత్తిబాబు, చంటి, నక్కర సతీష్ మరియు తదితరులు పాల్గొన్నారు. ఈ నిరసనను ఉద్దేశించి జనసేన ఎస్. కోట. నియోజకవర్గ నాయకులు వబ్బిన సన్యాసినాయుడు, వబ్బిన సత్తిబాబు మాట్లాడుతూ.. ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించి, కరెంట్ కోతలు నివారించకపోతే భవిష్యత్తులో మరిన్ని ఆందోళన కార్య క్రమాలతో పోరాటాన్ని ఉదృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.