‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ టీంకు రామ్ చరణ్ ప్రశంసలు

సత్యదేవ్ హీరోగా దర్శకుడు వెంకటేష్ మహా రూపొందించిన చిత్రం ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’.  థియేటర్ లో విడుదల చేయాలనుకున్నా కరోనా కారణంగా తాజాగా ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కేరాఫ్ కంచరపాలెం సినిమా మేకర్స్ రూపొందించిన ఈ సినిమాకు ఓటీటీలో మంచి రెస్పాన్స్ వచ్చింది. పలు విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న ఈ చిత్రంకు రామ్ చరణ్ నుండి కూడా ప్రశంసలు దక్కాయి. ఈమద్య కాలంలో వేరే సినిమాల గురించి ఎక్కువగా స్పందించని రామ్ చరణ్ ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమా గురించి మాత్రం చాలా పాజిటివ్ వ్యాఖ్యలు చేశాడు. సినిమా గురించి జనాలు ఆలోచించే విధంగా చేశాడు. సినిమా చాలా బాగుంది. సినిమా కంటెంట్ నిజం చెప్పినట్లుగా చాలా బాగుంది.

సత్యదేవ్ తో పాటు ఇతర నటీనటులు అంతా కూడా బాగా చేశారు. సినిమా సక్సెస్ కు యూనిట్ సభ్యులందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేశాడు. చరణ్ తో పాటు ఇంకా కొందరు ప్రముఖులు కూడా ఇంతకు ముందే ఉమామహేశ్వ ఉగ్రరూపశ్య సినిమా గురించి మాట్లాడుతూ ప్రశంసలు కురిపించారు. చరణ్ ప్రశంసలతో సినిమాకు ఓటీటీలో మరింత వ్యూస్ దక్కే అవకాశం ఉందంటున్నారు.