వృద్ధురాలికి అండగా రామ్ చరణ్ యువ ఫౌండేషన్

రామ్ చరణ్ యువ ఫౌండేషన్, రామ్ చరణ్ యువశక్తి ఆద్వర్యంలో మెగా అభిమానుల ఆరాధ్య దైవం మెగాస్టార్ చిరంజీవి తనయుడు గ్లోబల్ స్టార్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు వారోత్సవాలలో భాగంగా మెగా ఫ్యాన్స్ ఆద్వర్యంలో 85 సంవత్సరాల వృద్దురాలికి తన అనారోగ్యం కారణంగా ప్రతి నెల మందులకు 500₹ పైన అవుతోందని తనకు ఎటువంటి జీవనాధారం లేదని ప్రస్తుతం ఉన్న అద్దె ఇంటికి అద్దె కూడా కట్టలేకపోతున్నాని రామ్ చరణ్ యువ ఫౌండేషన్ సభ్యులకు తెలియడంతో వ్యవస్థాపకులు కడపల సుధాకర్ రెడ్డి, అధ్యక్షులు మనోహర్, లక్ష్మణ కుటాల గ్రూప్ సభ్యుల సహకారంతో ఆమెకు ఒక నెల రోజులకు సరిపడ నిత్యావసర సరుకులను అందిస్తూ ప్రతి నెల ఆమె మందులకు అయ్యే ఖర్చును రామ్ చరణ్ యువ ఫౌండేషన్ సభ్యులే చూసుకుంటారని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మెగా అభిమానులు నందిశెట్టి బాబు, ముజీబ్, కార్తిక్, చక్రి, హరీష్ వాల్మీకి, హరిబాబు, రాజేంద్ర, గణేష్, గంగాద్రి తదితరులు పాల్గొన్నారు.