బసవతారకం ఆసుపత్రిలో ఉచితంగా అరుదైన శస్త్ర చికిత్స..!

హైదరాబాద్​లోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో బ్రెస్ట్ క్యాన్సర్ రోగికి శస్త్ర చికిత్స చేసి భారీ కణితిని వైద్యులు తొలగించారు. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాళహస్తికి చెందిన యువతి రొమ్ము క్యాన్సర్‌తో బసవతారకం ఆస్పత్రికి రాగా ఆమెకు శస్త్ర చికిత్సచేసిన వైద్యులు భారీ కణితిని తొలగించారు. ఈ ఆపరేషన్‌ను ఉచితంగానే నిర్వహించడం జరిగింది. ఆపరేషన్ సక్సెస్ అయిన అనంతరం ఆస్పత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ ఆ యువతిని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకంగా మీడియా మీట్ నిర్వహించి ఆపరేషన్‌కు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

బసవతారకం క్యాన్సర్​ ఆస్పత్రిలో శ్రీకాళహస్తికి చెందిన మహిళకు రొమ్ము క్యాన్సర్ కు అరుదైన శస్త్ర చికిత్స చేసి కాపాడినట్లు బాలకృష్ణ తెలిపారు. రొమ్ము కాన్సర్​తో బాధపడుతూ.. చివరి దశలో బసవతారకం ఆస్పత్రిలో చేరారని.. పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆమెకు అత్యవసర చికిత్స అవసరమని వైద్యులు చెప్పినట్లు బాలయ్య తెలిపారు. ఆపరేషన్​ చేయాల్సిన సమయానికి సదరు మహిళ కరోనా బారిన పడ్డారన్నారు. కొవిడ్​ నుంచి కోలుతున్న తర్వాత శస్త్ర చికిత్స చేసినట్లు వివరించారు. పూర్తి ఉచితంగా వైద్యం అందించినట్లు బాలయ్య తెలిపారు.