శ్రీ గోశాలమ్మ తల్లి ఆలయానికి 10,116 విరాళం అందచేసిన రాయపురెడ్డి కృష్ణ

మాడుగుల, మాడుగుల మండలం కాశిపురం గ్రామంలో వెలిసియున్న శ్రీ గోశాలమ్మ తల్లి నాలుగవ వార్షికోత్సవ మహోత్సవం సందర్భంగా ఆహ్వానం మేరకు మాడుగుల నియోజకవర్గ జనసేన-టిడిపి సమన్వయ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ రాయపరెడ్డి కృష్ణ పాల్గొని ఆలయ కమిటీ సభ్యులు సేనాపతి సముద్రంకు 10,116 రూపాయలును విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు జాజిమొగ్గల రాము, జాజిమొగ్గల అప్పారావు, జాజిమొగ్గుల మంగ లక్ష్మి, జనసేన నాయకులు పడాల చాణక్య, తరుణ్ కృష్ణ రావు ప్రసాద్ జాజిమొగ్గల చిరంజీవి సేనాపత కృష్ణ బొడ్డి లోకేష్ బొడ్డు రమణబాబు గంగరాజు బొడ్డు వెంకట్రావు, బొడ్డి మోహన్, జాజిమొగ్గల శ్యామ్, సేనాపతి బాలరాజు లోకేష్ రవణబాబు విరోధి గణేష్, పేలురు గణేష్ తదితరులు పాల్గొన్నారు.