ఉర్దూ టీచర్ ని వెంటనే నియమించాలని జనసేన డిమాండ్

అనంతసాగరం జనసేన పార్టీ మండల అధ్యక్షులు షేక్ మహబూబ్ మస్తాన్ పత్రికా విలేకరులతో మాట్లాడుతూ… టి.జె.ఎన్ జడ్పి హైస్కూల్ లో ఉర్దూ సబ్జెక్ట్ బోధించడానికి ఉర్దూ టీచర్ లేక విద్యార్థులు ఉర్దూ సబ్జెక్ట్ కు దూరం అవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన స్కూల్స్ విలీన ప్రక్రియలో భాగంగా అనంతసాగరంలోని ఉర్దూ మీడియం స్కూల్ లోని 3,4,5 తరగతులు హైస్కూల్ లో విలీనం చేశారు. అక్కడ ఉర్దూ టీచర్ లేక 3 నుండి 10వ తరగతి వరకు గల ఉర్దూ విద్యార్థులు ఉర్దూ సబ్జెట్ ను పూర్తిగా మరిచిపోయే పరిస్థితి ఏర్పడిందని. కావున మండల విద్యాధికారులు, స్కూల్ హెచ్.ఎం వెంటనే స్పందించి ఉర్దూ టీచర్ నియమించే ఏర్పాటు చేయాలి. లేకపోతే కనీసం డిప్యుటేషన్ మీద అయిన ఒక ఉర్దూ టీచర్ ను నియమించాలని జనసేన పార్టీ తరపున కోరుతున్నాము. లేనిపక్షంలో విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తాం అని తెలియజేస్తున్నామని తెలిపారు.