రాజోలు చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ సేవలు

ది.27-8-21,శుక్రవారం. ప్రాణాలను నిలిపే ప్రాణవాయువు – చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్. మెగాస్టార్ చిరంజీవి గారు  రాజోలు లో ఏర్పాటు  చేసిన  ఆక్సిజన్ బ్యాంకు నందు నిర్విరామంగా సేవలు కొనసాగుతూనే ఉన్నాయి.

పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం కుమ్మరిపాలెం గ్రామానికీ చెందిన వాస్కురి దుర్గా భవాని గారికి మలికిపురం MD హాస్పిటల్ లో ఆక్సిజన్ అత్యవసరం కావడంతో ముత్యాల నితిష్‌కుమార్ గార్లుని  సంప్రదించగా.. నితీష్ రాజోలు చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకుకు తెలియపరచడంతో  సంబంధిత బంధువులకు ఆక్సిజన్ సిలెండర్ ను ఇవ్వడం జరిగింది..

#ChiranjeeviOxygenBanks

#GiveOxygenGiveLife