బ్యాంకుల ప్రైవేటీకరణపై ఆర్‌బీఐ కీలక వ్యాఖ్యలు!

బ్యాంకులు ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తున్నామన్నారు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్. ఆరోగ్యకమైన బ్యాంకింగ్ రంగమే తమ లక్ష్యమని ఆయన అన్నారు. నిరర్ధక ఆస్తుల భారంతో కుంగిపోయిన బ్యాంకింగ్ రంగాన్ని తిరిగి గాడిన పెట్టడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని..ఆరోగ్యకమైన బ్యాంకింగ్ రంగమే తమ లక్ష్యమని శక్తికాంత దాస్ అన్నారు. నిరర్ధక ఆస్తుల భారంతో కుంగిపోయిన బ్యాంకింగ్ రంగాన్ని తిరిగి గాడిన పెట్టడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

ఇందులో భాగంగానే పలు బ్యాంకులను ప్రైవేటీకరించాలని నిర్ణయించింది. అయితే అన్ని బ్యాంకులను తాము ప్రైవేటీకరించబోమని ఇప్పటికే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఇక ఆర్థిక కార్యకలాపాలు ఇలాగే కొనసాగుతాయని, తాము 2022 ఆర్థిక సంవత్సరానికి అంచనా వేసిన వృద్ధి రేటు 10.5 శాతం అలాగే ఉంటుందని కూడా ఈ సందర్భంగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ స్పష్టం చేశారు.