నియోజకవర్గ అభివృద్ధిపై ప్రజల మధ్య చర్చకి సిద్ధమా: జనార్దన శ్రీకాంత్ వబ్బిన

పెందుర్తి, జనసేన నాయకులు వబ్బిన జనార్దన శ్రీకాంత్ తన కార్యాలయంలో మాట్లాడుతూ పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజ్ కొద్ది రోజుల క్రితం ఒక ప్రైవేట్ న్యూస్ ఛానెల్ లో మాట్లాడిన మాటలు మతిభ్రమించి మాట్లాడుతున్నాట్లుగా ఉందని, జనసేన పార్టీ అధ్యక్షులు మీద మాట్లాడ్డం తీవ్ర హాస్యాస్పదంగా ఉందని ఖండించడం జరిగింది. జనసేన పార్టీ అధ్యక్షులకు మాట్లాడడం రాదని సంబోధించడం ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని, మీ నాయకుడు అయినటువంటి జగన్మోహన్ ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు నడిరోడ్డు మీద అధికార పార్టీ నాయకుల్ని కాల్చి చంపిన పరవాలేదని మాట్లాడడాన్ని మర్చిపోయారా, అలాంటి వ్యక్తి నాయకత్వం వహిస్తున్న పార్టీలో ఉంటూ మీరు ఇప్పుడు ఎదుటివారు ఎలా మాట్లాడాలో చెప్పడాన్ని హాస్యాస్పదంగా ఉందని, ఒక నిజాయితీపరుడు నిజాయితీగా సంపాదించి ప్రభుత్వానికి కట్టవలసిన టాక్స్లు కొడుతూ తన మిగిలిన సంపాదనలో సమస్యలో ఉన్న ప్రజలకు దానం చేస్తూ యువతలో చైతన్యం రావాలని రాజకీయంలో సామాజిక విప్లవం మొదలు అవ్వాలని జనసేన పార్టీ పెట్టి కష్టపడుతున్న వ్యక్తిని 18 నెలలు జైల్లో ఉండి ఆర్థిక లావాదేవీలు అవినీతిపరమైన కేసులు ఉన్న వ్యక్తి బెయిల్ మీద ప్రజల్లో తిరుగుతున్న వ్యక్తి, వైఎస్ఆర్సిపిలో 95 శాతం అవినీతి కేసులు ఉన్నా నాయకులు తనను ఇష్టాసారంగా మాట్లాడుతున్నప్పుడు తోలు తీస్తాం చెప్పు తీసి కొడతాను ఇటువంటి పదాలు వాడడంలో తప్పేముంది అని సూటిగా ప్రశ్నించడం జరిగింది, మీ నాయకుడిలాగా చంపేస్తాను అని అనలేదు కదా మాట్లాడేటప్పుడు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకుని మాట్లాడాలి, జీవీఎంసీ ఎలక్షన్లో ఓడిపోవడానికి మా నాయకులు వేరే పార్టీలకు వెళ్లడం అని ముఖ్యంగా 88 వ వార్డులో మా నాయకులు జనసేన పార్టీలోకి వెళ్లారని సంబోధించడాని మతిభ్రమించేలా ఉందని, మీ నాయకుడు జనసేన పార్టీలోకి రాలేదని జనసేన పార్టీ సభ్యత్వం తీసుకోలేదని, ఎలక్షన్స్ నిమిత్తం కార్పొరేటర్ గా పోటీచేయలని ఉద్దేశంతో మా మిత్ర పార్టీ అయినా బిజెపిలోకి వెళ్లడం జరిగిన విషయాన్ని మర్చిపోయినట్టున్నారని, 2019 సంవత్సరంలో జనసేన పార్టీకి సుమారు 4000 ఓట్లు వచ్చాయినీ, మొన్న జీవీఎంసీ ఎలక్షన్లో కూడా ఆ ఓట్లు బిజెపికి వచ్చాయి అని, ఈ వార్డులో ఉన్న ప్రజలు ఎల్లవేళలా జనసేన పార్టీకి ఆశీర్వదిస్తారని, ఈ మాటలు మీరు వెనక్కి తీసుకోవాలని, ఇంకా మీరు నియోజవర్గ అభివృద్ధిపై మాట్లాడుతూ ఎలక్షన్స్ వస్తున్నాయని పంచ గ్రామాల సమస్య తాడి గ్రామ సమస్య కోసం మాట్లాడడం జరిగిందని మీరు ఎమ్మెల్యేగా గెలవడం వల్ల మీ కుటుంబంలో ఉన్న వారికి రాజకీయంగా ఉద్యోగాలు వచ్చాయి మీ కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి జరిగింది తప్ప ప్రజలకు ఎటువంటి అబివృద్ధి జరగలేదని, పిట్టవానిపాలెం సమస్య, యువతకు ఉద్యోగాలు, సబ్బవరం మండలం అభివృద్ధి, రోడ్లు, మహిళ సాధికారిక, ఇలా చెప్పుకుంటూ పోతే నియోజవర్గ అభివృద్ధిపై ప్రజల మధ్య జనసేన పార్టీతో చర్చకు సిద్ధమా అని సవాలు విసరడం జరిగింది.