పవన్ కళ్యాణ్ ఏం చెప్తే అది చేయడానికి సిద్ధం

నెల్లూరు, ఎన్నో అవమానాలు ఎదుర్కొని సమాజసేయస్సును కాంక్షించి ముందుకు నడుస్తున్న పవన్ కళ్యాణ్ వెనుక నడవడానికి మేమంతా సిద్ధం అంటూ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ ఆధ్వర్యంలో సుబేదారు పేట నందు వారి కార్యాలయంలో జనసేన పార్టీలో చేరిన సోషల్ జస్టిస్ ఆర్గనైజేషన్ టీం కోటయ్య టీం. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ఈరోజు సోషల్ జస్టిస్ ఆర్గనైజేషన్ నుంచి కోటయ్య వారి టీం జనసేన పార్టీలో చేరడం సంతోష దాయకం. ఎవరికోసమైతే పవన్ కళ్యాణ్ కష్టపడుతున్నారు. ఆ యువతంతా కూడా ఆయన వెన్నంటే నడవడానికి సిద్ధంగా ఉంది. క్షుణ్ణంగా ఆలోచించి తీసుకున్న వారిని నిర్ణయానికి కట్టుబడి ఉన్నారు. బీరు, బిర్యానీ డబ్బుకి లొంగకుండా పార్టీలో కష్టపడి పని చేయడానికి వస్తున్న యువతకి మంచి నిర్దేశం చేసి పవన్ కళ్యాణ్ ఆశయాలు ఆచరణలో పెడతామని తెలిపారు.