జనసేన పార్టీ తరఫున పోరాటాలు చేయడానికి సిద్ధం: పోలిశెట్టి చంద్రశేఖర్

రామచంద్రపురం, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రత్యేక విమానం టేకాఫ్ కాకుండా అడ్డుకున్న పోలీసుల విధానాల పట్ల మాట్లాడుతున్న రామచంద్రపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్. ఆదివారం మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జరగాల్సిన పార్టీ పీఏసీ సభ్యులు, ముఖ్య నాయకుల సమావేశం నిమిత్తం శనివారం విజయవాడకు బయలుదేరిన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ని బేగంపేట ఎయిర్పోర్ట్ లోనే టేకాఫ్ కాకుండా అడ్డుకున్న అడ్డుకున్న పోలీసులు. పోలిశెట్టి చంద్రశేఖర్ రామచంద్రపురం పట్టణ నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ కి రావాలంటే జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక వీసాలు పాస్పోర్ట్ లు ఇవ్వవలసిన పరిస్థితిని తీసుకువస్తున్నారు. రోడ్డు మార్గం ద్వారా కాన్వాయ్ లో మంగళగిరి వస్తుంటే అనుమంచిపల్లి దగ్గర పోలీసులు పవన్ కళ్యాణ్ ని అడ్డుకోవడం. పోలీస్ వ్యవస్థ అనేది ఎందుకు ఉంది??? ప్రజలను కాపాడడానికా లేదా జలియన్ వాలాబాగ్ హత్యాకాండ అలాంటి సందర్భాలలో బ్రిటిష్ వారు చేసిన రూలింగ్ ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అవలంబిస్తున్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి ఆంధ్రరాష్ట్రంలో తిరిగే స్వేచ్ఛ కూడా లేదా అని జనసేన పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాం. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయానికి తదుపరి వారాహి యాత్ర కార్యాచరణ నిమిత్తం బయలుదేరుతున్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ ని కూడా హౌస్ అరెస్ట్ చేయడం. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు ఏ విధంగా సంకేతాలు ఇస్తున్నారు. ముఖ్యమంత్రి అయితే ఏదైనా చేసేయొచ్చా అని భావిస్తున్నారా??? వైసిపి పార్టీని ఖండించడమే కాకుండా బలమైన పోరాటాలు చేయవలసిన పరిస్థితిలు కనిపిస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి కి మేము ఇచ్చే హెచ్చరిక జనసేన పార్టీని ఎన్ని రకాలుగా అనగదొక్కాలని చూసిన అంతకంటే అత్యధిక బలంతో మీ వైసీపీ పార్టీని 2024లో తుంగలోకి తొక్కి అధికారంలోకి వచ్చే పార్టీ ఈ జనసేన పార్టీ అని రామచంద్రపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్చార్జి పోలిశెట్టి చంద్రశేఖర్ తెలియజేయడం జరిగింది. ఇలాంటి పరిస్థితులు మళ్లీ వస్తే జనసైనికులు పోలీస్ స్టేషన్లను ముట్టడించడం, ధర్నాలు చేయడం, రోడ్ల మీదకు వచ్చే పరిస్థితిలు వస్తాయని పోలీసు వారు మీ పై అధికారులకు తెలియజేసి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని, ఇలాంటివి పునరావృతం కాకుండా పోలీసు వారు ప్రభుత్వానికి తెలియజేయవలసిందిగా తెలియజేయడం జరిగింది. లేనియెడల జనసేన పార్టీ తరఫున పోరాటాలు చేయడానికి కూడా సిద్ధమని పోలిశెట్టి చంద్రశేఖర్ తెలియజేయడం జరిగింది.