ఆంధ్రరాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అమరజీవి పొట్టి శ్రీరాములుకు ఘననివాళులర్పించిన రెడ్డి అప్పల నాయుడు

ఏలూరు: నవంబర్ 1 ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మంగళవారం వసంతమహల్ సెంటర్ లో ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన పశ్చిమగోదావరి జిల్లా అధికార ప్రతినిధి ఏలూరు నియోజకవర్గ ఇంచార్జి రెడ్డి అప్పల నాయుడు

ఈ సందర్భంగా రెడ్డి అప్పల నాయుడు మాట్లాడుతూ.. ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ప్రాణత్యాగానికైన నిరాహార దీక్ష లో కూర్చుని మద్రాసు నుంచి దాదాపు 50,60 రోజులు నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసిన మహానుభావుడు పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవం కోసం పొట్టి శ్రీరాములు చేసిన పోరాటం తెలుగు వారందరికీ స్ఫూర్తిదాయకం అని, ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారిని స్మరించుకుంటూ రాష్ట్ర ప్రజలందరికీ ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అన్నారు.. దేశంలో భాషా ప్రాతిపదికన ఏర్పడిన తొలి రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం అని అన్నారు. భాషా ప్రయుక్త రాష్ట్రాలకు బీజం వేసిన వ్యక్తి పొట్టి శ్రీరాములు. ఆయనతో పాటు ఇతర స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు ఎంతగానో మనకు ప్రేరేపింపజేస్తున్నాయి. పొట్టి శ్రీరాములు తనను తాను సమాజాభివృద్ధికి నిర్మాణానికి పాటుపడే కార్యకర్తగా నిర్వచించుకునేవారని తెలిపారు. మహానుభావుల త్యాగాలను మననం చేసుకుంటూ వారిని స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్ర సంక్షేమం అభివృద్ధి కోసం మనమంతా అంకితభావం నిబద్ధతతో ముందుకెళ్లవలసిన అవసరం ఉందని ఆయన తెలిపారు. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం బుధ్ధి హీనులైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి మూడు ముక్కలాటలాడుతూ పూర్వీకులు చేసిన త్యాగాలను తుంగలో తొక్కుతూ మూడు రాజధానుల డ్రామాలాడుతున్నారని అన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు యొక్క త్యాగాన్ని ఆశయాలను తీసుకుని రాబోయే రోజుల్లో ఆంధ్ర ప్రదేశ్ ను పతిష్ఠంగా బలంగా బలమైన నిర్ణయాలతో రాబోయే రోజుల్లో మంచి పరిపాలన అందించాలని, పవన్ కల్యాణ్ గారి ఆశయాలను, సిద్ధాంతాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తామని తెలియజేశారు. ఒకవైపు రాబోయే జనరేషన్ కీ మంచి కల్చర్ నీ ఏర్పాటు చేసే జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ రాష్ట్ర అభివృద్ధి కీ పునాది వేసే దిశగా ప్రయాణం చేస్తామని ఈ సందర్భంగా ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు గారికి నివాళులు ఆర్పిస్తూ వారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి ఓబిలిశెట్టి శ్రావణ్ గుప్తా, నగర అధ్యక్షుడు నగిరెడ్డి కాశీ నరేష్, ఉపాధ్యక్షుడు బొత్స మధు, ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్, అధికార ప్రతినిధి అల్లు సాయి చరణ్, మండల ఉపాధ్యక్షులు సుందరనీడి ప్రసాద్, జాయింట్ సెక్రటరీ ఎట్రించి ధర్మేంద్ర, కార్యవర్గ సభ్యులు బోండా రాము నాయుడు, సోషల్ మీడియా కో ఆర్డినేటర్ జనసేన రవి, నాయకులు సోషల్ సర్వీస్ మురళి, రెడ్డి గౌరీ శంకర్, నిమ్మల శ్రీనివాసు, కందుకూరి ఈశ్వరరావు, పసుపులేటి దినేష్, బుధ్ధా నాగేశ్వరరావు, గోపిశెట్టిఅప్పారావు, జనపరెడ్డి తేజ ప్రవీణ్, పొన్నూరు రాము, పవన్, ఈనమూరి స్వామి, జగదీష్, జి.శ్రీను, కాకర్ల శ్రీను, గెడ్డం చైతన్య, వాసా సాయి, వెంకట రమణ వీర మహిళలు కావూరి వాణి తదితరులు పాల్గొన్నారు.