వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై ధ్వజమెత్తిన రెడ్డి అప్పల నాయుడు

ఏలూరు, రాష్ట్రంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న రౌడీ అరాచక పాలన పెట్రేగిపోతున్నాయని రెడ్డి అప్పల నాయుడు ధ్వజమెత్తారు. శుక్రవారం టెక్కలిలో జనసేన పార్టీ కార్యాలయంపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ మరో పక్కన సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి అవనిగడ్డ సభలో పచ్చి అబద్దాలు ఆడుతున్నారు. పవన్ కళ్యాణ్ చెప్పు చూపించి మాట్లాడితే ప్రజలు ఎక్కడ తమ ప్రభుత్వంపై తిరగపడతారని భయం పట్టుకొని 3 పెళ్ళిళ్ళు గురించి మాట్లాడడం మహిళలని కించపరిచే విధంగా జగన్ మోహన్ రెడ్డి ఉపన్యాసం ఉందని రెడ్డి అప్పలనాయుడు విమర్శించారు. పార్టీ కార్యాలయం అంటే ప్రజలకి సమస్యలు తీర్చే పవిత్రమైన ప్రదేశం అటువంటి కార్యాలయం పైన దాడి చేయడం సరైన విధానం కాదని ఇకనైనా మీ తీరు మార్చుకోకపోతే ప్రజలు కచ్చితంగా బుద్ధి చెబుతారని హెచ్చరించారు. మీకు నిజంగా దమ్ముంటే 3 రాజధానులు రిఫరాండంగా చూపించి ఎన్నికలకు రండి ప్రజాక్షేత్రంలో తెల్చుకుందామని రెడ్డి అప్పలనాయుడు సవాలు చేసారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు నగిరెడ్డి కాశీ నరేష్, ఉపాధ్యక్షుడు బొత్స మధు, ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్, అధికార ప్రతినిధి అల్లు సాయి చరణ్, సోషల్ మీడియా కో ఆర్డినేటర్ జనసేన పార్టీ జనసేన రవి, నాయకులు కందుకూరి ఈశ్వరరావు, రాచప్రోలు వాసు, బాబు తదితరులు పాల్గొన్నారు.