ముగ్గుల పోటీలో పాల్గొన్న విజేతలకు బహుమతుల ప్రధానం చేసిన రెడ్డి అప్పలనాయుడు

ఏలూరు అగ్రహారంలో రెయిన్ బో వారు నిర్వహించిన ముగ్గుల పోటీలో పాల్గొన్న విజేతలకు పశ్చిమ గోదావరి జిల్లా అధికార ప్రతినిధి, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ రెడ్డి అప్పలనాయుడు బహుమతులను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ డిప్యూటీ మేయర్ జనసేన నాయకులు శిరిపల్లి శివరామకృష్ణ ప్రసాద్, స్థానిక రెయిన్ బో కిట్టి వారు గుడిమెట్ల లక్ష్మీ ఐశ్వర్య, గొళ్ళుపూడి జయలక్ష్మి, యిన్నమూరి స్వామి, భద్రం, సురేంద్ర గుప్తా. జడ్జీలుగా ఎం లలిత కుమారి, గుడిమెట్ల అచ్యుత, గొల్లపూడి అరుణ, గుడిమెట్ల పద్మ వ్యవహరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పశ్చిమగోదావరి జిల్లా జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి శ్రావణ్ కుమార్ గుప్తా, నగర ఉపాధ్యక్షులు పోణంగి బాబు, ప్రధాన కార్యదర్శి కావూరి వాణిశ్రీ, అధికార ప్రతినిధి అల్లు సాయి చరణ్ తేజ్, కార్యదర్శి గొడవర్తి నవీన్, కార్యనిర్వహక కార్యదర్శి పవన్ కుమార్, సోషల్ మీడియా కోఆర్డినేటర్స్ కోలా శివ, చిత్తిరి శివ, జనసేన నాయకులు రెడ్డి గౌరీ శంకర్, నాని, వీర మహిళలు తుమ్మపాల ఉమా దుర్గ, కోలా సుజాత తదితరులు పాల్గొన్నారు.