ఆంజనేయస్వామి ఆలయానికి శంకుస్థాపన చేసిన రెడ్డి అప్పలనాయుడు

ఏలూరు, ఏలూరు నగరపాలక సంస్థ 5వ డివిజన్ చెంచుల కాలనీలో శ్రీ భక్తాంజనేయ స్వామి వారి ఆలయ నిర్మాణానికి జనసేన పార్టీ పశ్చిమగోదావరి జిల్లా అధికార ప్రతినిధి ఏలూరు నియోజకవర్గ ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు శుక్రవారం ఉదయం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ప్రజలను పన్నుల రూపంలో వేధించకుండా, ఈ ప్రభుత్వ పెద్దలకు మంచి బుద్ధిని ప్రసాదించాలని ఆంజనేయస్వామిని ప్రార్థించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ 5 డివిజన్ నాయకులు, రెడ్డి గౌరీ శంకర్, తుమరాడ రమణ, జనసేన కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.