నిధులు మళ్ళించినందున గ్రామాల అభివృద్ధి కుంటుపడింది

  • రాజ్యసభ సభ్యులు సొంత నిధుల నుంచి విడుదల చేసి గ్రామాల రోడ్లు వేయండి అన్నా దిక్కులేని పరిస్థితి..

నెల్లూరు: రౌతు వినయ్ ఆత్మహత్యకు గల కారణాలను పరిశీలించి కేసు కట్టి దోషులను శిక్షించాల్సిందిగా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో జాయింట్ కలెక్టర్ ను కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం సూపరిటెండ్ అఫ్ పోలీసు కార్యాలయంలో రౌతు వినయ్ గురించి కేసు కట్టవలసినదిగా కోరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో గ్రామాల నిధులు మళ్ళించినందున గ్రామాల అభివృద్ధి కుంటుపడింది. గ్రామాలకు కనెక్టివిటీ రోడ్లు దారుణంగా ఉన్నాయి. సాక్షాత్ రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇది అత్యవసరమైన రోడ్డుగా భావించి సొంత నిధుల నుంచి 5 లక్షల రూపాయలు సాంక్షన్ చేయించి రెండు నెలలు గడుస్తున్నా పని ఒక అడుగు కూడా ముందుకు కదలని పరిస్థితి. పాటూరు గ్రామంలో గతంలో వరదలు వచ్చినప్పుడు చెరువులో చేపలు పడ్డప్పుడు స్థానిక వైసీపీ పెత్తందారులు 10,000 మాత్రమే పంచాయతీ ఆఫీస్ లో కట్టి చేపలు అప్పనంగా దోచేశారు. గ్రామ నిధులు దోచుకుంటూ గ్రామ అభివృద్ధిని కుంటు పరుస్తున్నారని ఇదొక నిదర్శనం. రూరల్ లో ఎంపీ నిధుల నుంచి గ్రామ అభివృద్ధి సాధిస్తానని అంటూ రూరల్ పోటీ చేస్తున్న అదాల ప్రభాకర్ రెడ్డి గారు చెప్పడం బాగానే ఉంది కానీ మిగిలిన గ్రామాల పరిస్థితి ఏమిటి. జిల్లాలో పల్లెల కనెక్టివిటీ రోడ్లు దారుణంగా ఉన్నాయి ప్రయాణించలేక వైఎస్సార్ సీపీ బస్సు యాత్ర కూడా వాయిదా వేసుకున్నట్టు ఉన్నారు. రానున్నది వర్షాకాలం, గుంటల వల్ల నానా ఇబ్బందులు గురికావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. గ్రామాల అభివృద్ధి పరుస్తామని కల్లబొల్లి మాటలు చెప్పి వైసిపి ప్రభుత్వం ఐదు సంవత్సరాలు గడిపేసింది. ఈ నాలుగు నెలలైనా శిలాఫలకాలతో కాకుండా అభివృద్ధి పనులు చేయాలని కోరుకుంటున్నాము. గ్రామ నిధులను మళ్లించి అభివృద్ధిని మరుగున పరుస్తున్న వైసిపి ప్రభుత్వానికి పల్లె ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చింది. ప్రభుత్వాన్ని గెలిపిస్తే గ్రామాల అభివృద్ధి గ్రామనిధులను గ్రామాల అభివృద్ది కార్యక్రమాలకు ఉపయోగిస్తాం. బుచ్చిరెడ్డిపాలెంలో ఆత్మహత్య చేసుకున్న రౌతు వినయ్ కుటుంబ సభ్యులు గత వారం రోజులుగా పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నా కేసు కట్టి దోషులను శిక్ష పడేవిధంగా చర్యలు ఏమి తీసుకోలేదు. స్వామి మాల వేసుకున్న వినాయ్ ని కొట్టింది నలుగురు ముస్లిమ్స్ దీనిని కొంతమంది మత తగాదాగా సృష్టించడానికి చూస్తున్నారు. వీలైనంత త్వరగా విచారించి కేసు కట్టి ఇటువంటి అభిప్రాయాలకు స్వస్తి పలకవలసిందిగా అవసరం ఎంతైనా ఉంది అని గుర్తుచేసి ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకులు కిషోర్, కార్యదర్శి ప్రశాంత్ గౌడ్, శరవణ, మౌనిష్, వర్షన్, కేశవ, శ్రీను తదితరులు పాల్గొన్నారు.