జనసేన పార్టీ ఎప్పుడూ ప్రజల పక్షానే ఉంటుంది

సర్వేపల్లి నియోజకవర్గం, తోటపల్లి గూడూరు మండలం, తోటపల్లి గూడూరు పంచాయతీ బిట్ నందు తాగడానికి నీళ్లు లేక పంచాయతీ మినరల్ వాటర్ ప్లాంట్ మోటర్ కాలిపోయి గత రెండు నెలల నుంచి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే పట్టించుకోని పంచాయతీ అధికారులు, సచివాలయం సిబ్బంది, సెక్రటరీతో శుక్రవారం ఫోన్ ద్వారా సంభాషించిన సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు. సెక్రటరీ ఇచ్చిన సమాధానం ఏమిటంటే మెకానిక్ నిన్న రావడం జరిగింది. మోటర్కు సంబంధించిన స్పేర్స్ దొరకలేదు అవి తీసుకొని వచ్చి రేపు సాయంత్రం లోపల రిపేర్ చేపిస్తామని చెప్పారు. నేను సెక్రెటరీ గాని ఒకటే కోరా మానవతా దృక్పథంతో తాగడానికి నీళ్లు లేకపోతే రెండు నెలల నుంచి ఎందుకు పట్టించుకోలేదు. మీ దగ్గర పంచాయతీ నిధులు లేకపోతే జనసేన పార్టీ దగ్గరుండి రిపేర్ చేయించి గ్రామస్తులకు తాగునీరు ఇవ్వడానికి కూడా సిద్ధమేనని చెప్పి చెప్పాం. రేపు సాయంత్రం లోపల వాటర్ రిపేర్ చేర్చకపోతే సోమవారం రోజు జనసేన పార్టీ దగ్గరుండి మోటార్ రిపేర్ చేయించి తాగడానికి నీరు అందిస్తుంది. ప్రజల పక్షాన ఎప్పుడూ జనసేన పార్టీ ఉంటుంది. ప్రజల కోసం ప్రజా శ్రేయస్సు కోసం యువత కోసం రాష్ట్రం కోసం ఎన్ని మెట్లైనా దిగి ప్రజాక్షేత్రంలో ప్రజలకు అండగా నిలబడుతుంది. జనసేన పార్టీ ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాలా ఈ సర్వేపల్లి నియోజకవర్గం తాగడానికి నీళ్లు లేకుండా ప్రజలు ఇబ్బందులు పడుతుంటే పట్టించుకోలేదంటే ఈసారి ఈయన గెలవడు కాబట్టి ఈయనకు పూర్తిగా అర్థమయ్యే నేడు ప్రజా సమస్యలను పట్టించుకునే స్థితిలో లేడు రాబోయేది ప్రజా ప్రభుత్వం ప్రజా ప్రభుత్వంలో ప్రజలు సస్యశ్యామలంగా ఉంటారు గ్రామాలను అభివృద్ధి చేస్తాం. ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్వేపల్లి నియోజక వర్గ మహిళా అధ్యక్షురాలు గుమ్మినేని వాణి భవాని, తోటపల్లి గూడూరు మండల అధ్యక్షులు అంకిం సందీప్ నాయుడు, ఉపాధ్యక్షులు కల్తి రెడ్డి శ్రీనివాసులు, మండల ప్రధాన కార్యదర్శి నడవల రవికుమార్, మండల కార్యదర్శి రాయపు పవన్ కెవిన్, తోటపల్లి గూడూరు మండల మత్స్యకార విభాగ నాయకులు రామంజి శ్రావణ్, రామంజి మల్లికార్జున్, వెంకటాచల మండల కార్యదర్శి శ్రీహరి, స్థానిక జనసేన నాయకులు బద్వేల్ చందు, యనమల ముఖేష్, బందిలి చరణ్, చక్రి, శశి, సాయికుమార్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.